Wednesday, May 8, 2024

హైదరాబాద్‌లో ఓలా ఎక్స్‌పీరియన్స్‌ సెంటర్లు..

హైదరాబాద్‌ : విద్యుత్‌ వాహనాల తయీరీ సంస్థ ఎలా ఎలక్ట్రిక్‌ హైదరాబాద్‌ నగరంలో మరో మూడు కొత్త ఎక్స్‌పీరియన్స్‌ సెంటర్లను ప్రారంభించింది. 2023లో దేశంలో రెండు వందలకు పైగా ఎక్స్‌పీరియన్స్‌ సెంటర్లను ప్రారంభించాలని ఓలా నిర్ణయించింది. ఇందులో భాగంగా మంగళవారం నాడు ఒక్క రోజే దేశవ్యాప్తంగా 50 సెంటర్లను ప్రారంభించింది. హైదరాబాద్‌లో ఇలా మూడు కొత్త సెంటర్లను ఏర్పాటు చేసింది. నగరంలోని మాదాపూర్‌లోని శ్రీరామ కాలనీలో, నాగోల్‌లోని ఆదర్శ్‌ నగర్‌లో, మెహిదీపట్నంలోని రేతిబౌలిలో ఈ సెంటర్లను ప్రారంభించింది. .

కొత్త వాటితో కలిపి హైదరాబాద్‌లో ఓలా ఎక్స్‌పీరియన్స్‌ సెంటర్ల సంఖ్య 7కు పెరిగింది. కస్టమర్లు తమ వాహనాలను సులభంగా కొనుగోలు చేసేందుకు వీలుగా ఈ సెంటర్లను పెంచుతున్నామని ఓలా చీఫ్‌ మార్కెటింగ్‌ ఆఫీసర్‌ అన్షుల్‌ ఖండేల్వాల్‌ చెప్పారు. ఈ సెంటర్లలో ఓలా ఎస్‌1, ఎస్‌1 ప్రో మోడళ్లను టెస్ట్‌ డ్రైవ్‌ చేయడంతో పాటు, కొనుగోలుకు ఉన్న ఫైనాన్స్‌ ఆఫ్షన్ల గురించి తెలుసుకోవచ్చు. ఓలా స్కూటర్లలో మూవ్‌ ఓఎస్‌ 3.0లో పార్ట మోడ్‌ ను తీసుకు వచ్చింది. దీనికి మంచి స్పందన రావడంతో మరో కొత్త ఫీచర్‌ను తీసుకు రానున్నట్లు తెలిపింది. మూవ్‌ ఓఎస్‌ 4.0 అప్‌డేట్‌లో కొత్త కన్సర్డ్‌ మోడ్‌ను తీసుకు రానుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement