Thursday, May 9, 2024

ఒడిశా రైలు ప్రమాదం – 293 కి చేరిన మృతుల సంఖ్య

ఒడిశా రైలు ప్రమాదంలో మ‌ృతుల సంఖ్య 293 కి చేరింది. రైలు ప్రమాదంలో మరో 900 మందికిపైగా తీవ్రగాయాలు అయ్యాయి. బాలాసోర్‌లో గూడ్స్ రైలును కోరమండల్‌ ఎక్స్‌ప్రెస్‌ ఢీకొన్న విషయం తెలిసిందే. దీంతో చెన్నై కోరమండల్‌ ఎక్స్‌ప్రెస్‌కు చెందిన 13 బోగీలు పట్టాలు తప్పాయి. కోరమండల్‌ రైలు బోగీలపై యశ్వంత్‌పూర్‌ ఎక్స్‌ప్రెస్ దూసుకెళ్లింది. ఘటనలో యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్‌ 4 బోగీలు పట్టాలు తప్పాయి. రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉంది

ఒడిశా రైలు ప్రమాద బాధితులకు కేంద్రం ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షలు ఆర్థికసాయం, తీవ్రంగా గాయపడ్డవారికి రూ. 2 లక్షలు, స్వల్పంగా గాయాలపాలైనవారికి రూ. 50 వేలు ఆర్థిక సాయం ప్రకటించింది

ప్రమాదం ఇలా జరిగింది..శుక్రవారం రాత్రి 7.15 గంటలకు బహనాగ స్టేషన్ సమీపంలో ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఈ కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ షాలీమార్‌ నుంచి చెన్నై వెళ్తోంది. మధ్యాహ్నం 3.20 సమయంలో అక్కడి నుంచి బయలుదేరింది. బహగాన స్టేషన్‌కు 7.15కి చేరుకుంది. ఆ సమయంలో పట్టాలు తప్పి లూప్‌ లైన్‌లో ఆగి ఉన్న గూడ్స్‌ను ఢీకొట్టింది. దాంతో ఇంజిన్‌తో పాటు 12 బోగీలు పక్క ట్రాక్‌పై ఒరిగిపోయాయి. ఇదే సమయంలో ఆ ట్రాక్‌పై యశ్వంత్‌పూర్-హౌరా ఎక్స్‌ప్రెస్ దూసుకొచ్చింది. కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ బోగీలను ఢీకొట్టింది. యశ్వంత్‌పూర్‌- హౌరా ఎక్స్‌ప్రెస్‌కు చెందిన నాలుగు జనరల్‌ బోగీలు ధ్వంసం అయ్యాయి. కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌లో A1, A2, B2, B3, B4, B5, B6, B7, B8, B9 కోచ్‌లు ధ్వంసం అయ్యాయి. ఇంజిన్‌తో పాటు పట్టాలు తప్పిన B1 బోగీ. ఘటనా స్థలంలో దృశ్యాలు హృదయ విదారకంగా ఉన్నాయి. కోరమాండల్‌ ఎక్‌ప్రెస్‌కి మొత్తం 24 బోగీలు ఉంటే.. సగం బోగీలు ధ్వంసమయ్యాయి

.

Advertisement

తాజా వార్తలు

Advertisement