Thursday, May 2, 2024

వ‌న్డే ప్ర‌పంచ క‌ప్ రీ-షెడ్యూల్.. మారిన తేదీలివే !

ఈ ఏడాది భారత్‌ వేదికగా అక్టోబర్ నుండి వన్డే ప్రపంచకప్ జ‌ర‌గ‌నుండ‌గా.. ఈ వ‌రల్డ్ క‌ప్ టోర్నీలో పొటీ ప‌డ‌నున్న భార‌త్-పాక్ మధ్య జ‌రిగే రీ-షెడ్యూల్ అయింది. భద్రతా కారణాల రీత్యా అక్టోబరు 15న జరగాల్సిన మ్యాచ్‌ను అక్టోబర్ 14న నిర్వహించనున్నారు.

మ‌రికొద్ది రోజుల్లోనే క్రికెట్ పండుగ‌ ప్రారంభం కానుంది. ఆగస్ట్ 30న తొలి మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. కొద్ది రోజుల క్రితమే ఆసియా క‌ప్ షెడ్యూల్ కూడా విడుదలైంది.. ఇక ఈ టోర్న‌మెంట్ కోసం అన్నీ సిద్దమ‌వ్వ‌గా.. ఇప్పుడు అక్టోబ‌ర్- న‌వంబ‌ర్ నెల‌ల్లో జ‌ర‌గ‌నున్న‌ మ్యాచ్ ల టైమింగ్స్ ని భద్రతా కారణాల రీత్యా మారుస్తూ కొత్త తేదీల‌ను ప్ర‌క‌టించింది BCCI. ఇవ్వాల (బుధవారం) మొద‌ట విడుద‌ల చేసిన‌ షెడ్యూల్‌లో తొమ్మిది మార్పులను చేసి ఈ మేరకు రీషెడ్యూల్‌ని ప్రకటించింది BCCI.

వాస్తవానికి అక్టోబర్ 15న అహ్మదాబాద్‌లో జరగాల్సిన భారత్-పాకిస్థాన్ పోరు ఇప్పుడు ఒక రోజు ముందే జ‌ర‌గ‌నుంది. అయితే, వేదికలో మాత్రం ఎలాంటి మార్పు లేదు. ముందుగా నిర్ణయించిన విధంగానే అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో మ్యాచ్‌ను నిర్వహించనున్నారు. అయితే.. ఢిల్లీలో జ‌ర‌గ‌నున్న‌ ఇంగ్లండ్-ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్ మొదట అక్టోబర్ 14న జరగాల్సి ఉండ‌గా.. మ్యాచ్ ను ఇప్పుడు అక్టోబర్ 15కు రీ-షెడ్యూస్ చేశారు.

- Advertisement -

అదేవిధంగా.. హైదరాబాద్ వేధిక‌గా.. అక్టోబర్ 12న‌ జ‌ర‌గాల్సిన శ్రీలంక-పాకిస్తాన్ మ్యాచ్ అక్టోబర్ 10కి మారింది. లక్నోలో జ‌రిగే దక్షిణాఫ్రికా-ఆస్ట్రేలియా మ్యాచ్ అక్టోబర్ 13 నుండి అక్టోబర్ 12కు రీ-షెడ్యూల్ అయ్యింది. ఇక‌, అక్టోబర్ 14 చెన్నైలో త‌ల‌ప‌డ‌నున్న‌ న్యూజిలాండ్-బంగ్లాదేశ్ ల‌ మ్యాచ్ కూడా ఒక‌రోజు ముందే అక్టోబర్ 13న‌ జ‌ర‌గ‌నుంది.

నవంబర్ 12న షెడ్యూల్ చేయబడిన డబుల్-హెడర్‌లు మ్యాచ్.. కోల్‌కతాలో ఇంగ్లండ్ vs పాకిస్తాన్ , పూణేలో ఆస్ట్రేలియా vs బంగ్లాదేశ్ – నవంబర్ 11కి మారుతాయి, అయితే భారతదేశం చివరి లీగ్ గేమ్ బెంగళూరులో నెదర్లాండ్స్‌తో నవంబర్ 11కి బదులుగా నవంబర్ 12న ఆడబడుతుంది.

నవంబర్ 12న‌ కోల్‌కతాలో జ‌ర‌గ‌నున్న‌ ఇంగ్లండ్-పాకిస్తాన్ మ్య‌చ్.. పూణేలో జ‌ర‌గ‌నున్న‌ ఆస్ట్రేలియా-బంగ్లాదేశ్ – నవంబర్ 11న జ‌ర‌గ‌నున్నాయి. ఇక, బెంగళూరు వేధిక‌గా నెదర్లాండ్స్‌తో భారత్ చివరి లీగ్ గేమ్ నవంబర్ 11కి బదులుగా నవంబర్ 12న జరగనుంది.

ఈ టోర్నమెంట్‌లో ఆరు ఆసియా జట్లు..(భారత్, పాకిస్థాన్, నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్) పాల్గొంటాయి. బహుళ-దేశాల ఈవెంట్ రెండు దశలుగా (గ్రూప్ స్టేజ్, సూపర్ ఫోర్స్) జ‌ర‌గ‌నుంది. కాగా, ఆసియా కప్ రెండు దేశాల్లో, నాలుగు వేదికలలో జరుగుతుంది. టోర్నమెంట్ ప్రారంభ మ్యాచ్ పాకిస్తాన్​లోని ముల్తాన్ క్రికెట్ స్టేడియంలో జరుగుతుంది.

కాగా, కొలంబోలోని ఆర్.ప్రేమదాస స్టేడియంలో ఫైనల్ మ్యాచ్ జరగనుంది. కాండీ, కొలంబోలో మొత్తం 9 మ్యాచ్‌లకు శ్రీలంక ఆతిథ్యం ఇవ్వగా, ముల్తాన్, లాహోర్‌లలో పాకిస్థాన్ 4 మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వనుంది. ఇక, ఆసియా కప్‌లో చిరకాల ప్రత్యర్థులు భారత్‌, పాకిస్థాన్‌ 13 మ్యాచ్‌ల్లో 3 సార్లు తలపడే అవకాశం ఉంది. ఒకసారి గ్రూప్ స్టేజ్ (గ్రూప్ A), ఒకసారి సూపర్ ఫోర్స్ మ‌రోక‌టి ఫైనల్‌లో అర్హత సాధిస్తే.

Advertisement

తాజా వార్తలు

Advertisement