Friday, May 3, 2024

ఈశాన్య రుతుపవనాలొచ్చేశాయ్‌!

ఈశాన్య రుతుపవనాలు దక్షిణ భారత దేశంలోకి ప్రవేశించాయని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. తమిళనాడు తీరప్రాంతాలు, పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్‌లోని దక్షిణ కోస్తా ప్రాంతాల్లోకి ఈశాన్య రుతుపవనాలు శనివారంనాడు ప్రవేశించినట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. బంగాళాఖాతం, దక్షిణ ద్వీపకల్పం మీదుగా ఈశాన్య గాలులు, రుతుపవనాల ప్రభావంతో ఆయా ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయని పేర్కొంది. ఈ మేరకు ఎల్లో అలర్ట్‌ను జారీ చేసింది. ఈ ఏడాది ఈశాన్య రుతుపవనాల కాలంలో సాధారణ వర్షపాతం నమోదవుతుందని ఐఎండీ అంచనా వేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement