Monday, December 9, 2024

Breaking: మొయినాబాద్ ఫాంహౌస్ కేసు.. ముగ్గురు నిందితుల‌కు 14 రోజుల రిమాండ్ విధింపు

తెలంగాణ ప్ర‌భుత్వాన్ని ఆగం జేయ‌డానికి య‌త్నించి.. టీఆర్ ఎస్ పార్టీకి చెందిన న‌లుగురు ఎమ్మెల్యేల‌ను కొనుగోలు చేయ‌డానికి వ‌చ్చిన ముగ్గురు నిందితుల‌కు హైకోర్టు ఆదేశాల మేర‌కు ఇవ్వాల (శ‌నివారం) రాత్రి ఏసీబీ కోర్టు జ్యుడిషియ‌ల్ రిమాండ్ విధించింది. రామచంద్రభారతి (సతీశ్​శర్మ), నందుకుమార్​, సింహయాజి అనే నిందితులకు 14 రోజుల పాటు రిమాండ్ విధిస్తూ ఏసీబీ కోర్టు ఆదేశించింది.

దిల్ సుఖ్ నగర్ లోని మెజిస్ట్రేట్ నివాసంలో పోలీసులు నిందితుల‌ను హాజరు పరిచగా ఈ మేర‌కు వారికి న‌వంబ‌ర్ 11వ తేదీ దాకి రిమాండ్ విధించారు. దీంతో పోలీసులు వారిని చంచల్​గూడ జైలుకు త‌ర‌లించే ప‌నిలో ఉన్నారు. ఈ క్ర‌మంలో రిమాండ్ ఆపాల‌ని నిందితుల త‌ర‌పు న్యాయ‌వాది వాద‌న‌లు వినిపించినా ఏసీబీ న్యాయ‌స్థానం ప‌ట్టించుకోలేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement