Saturday, April 27, 2024

షుగర్‌ ఎగుమతులకు నో…

మన దేశం నుంచి షుగర్‌ ఎగుమతులకు అనుమతి ఇవ్వబోమని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రపంచంలో భారత్‌, బ్రెజిల్‌ పంచదార ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉన్నాయి. ఈ సారి దేశీయంగా పంచదార ఉత్పత్తి తగినంతగా లేదన్న కారణంగా ఎగుమతులకు ప్రభుత్వం అంగీకరించలేదు. ఈ సీజన్‌లో ఇప్పటికే ఇండియా 6 మిలియన్‌ టన్నుల షుగర్‌ ఎగుమతులకు అనుమతి ఇచ్చింది. ఇంతకు మించి ఎగుమతులను అనుమతించకూడదని ప్రభుత్వం నిర్ణయించింది. ఇటీవల అన్న ప్రాంతాల నుంచి షుగర్‌ ఉత్పత్తిదారులతో ప్రభుత్వం సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలోనే ఎగుమతులకు అనుమతి ఇవ్వకూడదన్న నిర్ణయాన్ని తీసుకున్నారు.

ఈ సారి ఉత్పత్తి తగ్గుతుందన్న అంచనాతో దేశంలో కొద్ది రోజులుగా షుగర్‌ ధరలు పెరుగుతున్నాయి. ద్రవ్యోల్బణం నియంత్రణకు చర్యలు తీసుకుంటున్న ప్రభుత్వం ధరల పెరగుదలపై నిరంతరం సమీక్షిస్తోంది. ధరలను నియంత్రణలో ఉంచేందుకే షుగర్‌ ఎగుమతులను అంగీకరించకూడదని ప్రభుత్వం నిర్ణయించింది. దేశంలో సాఫ్ట్‌ డ్రింక్స్‌ తయారీ సంస్థలు, క్యాండీ తయారీ సంస్థలు బ్రెజిల్‌. థాయిలాండ్‌ నుంచి షుగర్‌ను దిగుమతి చేసుకునేందుకు సంప్రదింపులు జరిపారు. షుగర్‌ ధరలు మన దేశంలో పెరుగుతుండటంతో వీరు దిగుమతులు చేసుకునేందుకు చర్చలు జరుపుతున్నారు. దేశం నుంచి షుగర్‌ ఎగుమతులను నిలిపివేస్తే, దేశీయంగా ధరలు తగ్గుతాయని భావిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement