Monday, May 6, 2024

తెలంగాణ‌లో నైట్ క‌ర్ఫ్యూ ఉండదు.. సామూహిక కార్యక్రమాలకు ప్రజలు దూరంగా ఉండాలే..

ఓ వైపు థర్డ్‌ వేవ్‌ హెచ్చరికలు… మరోవైపు ఒమిక్రాన్‌ వ్యాప్తి ఆందోళనలు… ఇప్పటికీ తెలంగాణలో ప్రతి రోజూ సగటున 200దాకా కరోనా కేసులు నమోదవు తున్నాయి. కరోనా కేసులు పెరుగుతున్న ప్రాంతాల్లో నైట్‌ కర్ఫ్యూ విధించాలని రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్య శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ పరిస్థితుల్లో మరోసారి కఠిన చర్యలు అమలు చేయాల్సిన పరిస్థితులు పునరావృతం కావొద్దు అంటే… ప్రజలంతా కొవిడ్‌ నిబంధనలను తూచ తప్పకుండా పాటించాలని రాష్ట్ర ప్రజారోగ్యశాఖ డైరెక్టర్‌ డా.జీ.శ్రీనివాసరావు స్పష్టం చేసారు. ఇంట్లో, బయట ప్రజలు విధిగా మాస్కు ధరించాలంటున్నారు. కచ్చితంగా రెండు డోస్‌ల కరోనా వ్యాక్సిన్‌ తీసుకోవాలని, సామూహిక కార్యక్రమాలకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు.

రాష్ట్రంలోకి ఒమిక్రాన్‌ ప్రవేశించేందుకు అవకాశం లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఒమిక్రాన్‌ వేరియంట్‌ వ్యాప్తిని గుర్తించినా నైట్‌ కర్ఫ్యూ, లాక్‌డౌన్‌ విధించే అవకాశాలు దాదాపూ లేవు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయమే అంతిమం. నైట్‌ కర్ఫ్యూ కాని, లాక్‌డౌన్‌ పరిస్థితులు కాని రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రజలదే. కొవిడ్‌ జాగ్రత్తలు తూచ తప్పకుండా పాటిస్తే ఆ కఠిన పరిస్థితులు ఎదుర్కోవాల్సిన అవసరం ఉండనే ఉండదు. ప్రతీ ఒక్కరూ కొవిడ్‌ జాగ్రత్తలైన మాస్కు ధరించడం, సామూహిక కార్యక్రమాలకు దూరంగా ఉండడం, విధిగా రెండు డోస్‌ల కరోనా వ్యాక్సిన్‌ తీసుకుంటే తెలంగాణలో ఒమిక్రాన్‌తోపాటు ఇతర కరోనా వేరియంట్ల వ్యాప్తిని సమర్థంగా కట్టడి చేయొచ్చు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement