Thursday, May 2, 2024

నిద్ర లేచిన పాము..

‘బిగ్‌ స్నేక్‌ కింగ్‌’. ట్రైలర్‌కు మంచి స్పందన వచ్చిన సందర్భం గా చిత్ర సమర్పకుడు ఏలూరు సురేంద్ర రెడ్డి మాట్లాడుతూ ” ప్రపంచ వ్యాప్తంగా మార్చ్‌ 3న అన్ని భాషల్లో ఈ సినిమా విడుదల అవుతుంది. తెలుగులో నేను విడుదల చేస్తున్నాను. కథ విషయానికి వస్తే.. చైనా లోని ఒక గ్రామానికి చెందిన లీ.. కొంతమంది గ్రామస్థులను అక్రమ తవ్వకాల కోసం ఒక గుహ దగ్గరకు తీసుకెళ్తాడు. అయితే వారి కారణంగా వందేళ్లు గా నిద్రపోతున్న అతి పెద్ద పాము నిద్ర లేస్తుంది. దీని నుండీ తప్పించుకునే సమయంలో లీ మాత్రమే బ్రతికి బయటపడతాడు. కొన్ని రోజుల తర్వాత దానిని తరిమి కొట్టడానికి గ్రామస్థులు యాగాలు చేయడం ప్రారంభిస్తారు. మహారాజు కుమారుడు చింగ్‌ చాంగ్‌ వచ్చి ఆ గ్రామానికి సాయం చేస్తాడు. లీ కుమార్తె మింగ్‌ యు అతనితో కలిసి గ్రామస్థులను దూరంగా పంపి ఆ పెద్ద పామును డైనమైట్‌ బాంబ్‌ తో పేల్చి చంపేస్తారు. చివరిగా భూమి పై ఏ ప్రాణికి హాని చేయకూడదని గ్రామస్థులు ప్రతిజ్ఞ చేస్తారు.
ఈ సిరీస్‌ లో ఇప్పటికి పది సినిమాలు వచ్చాయి. అవన్నీ కూడా నేనే నెలకి ఒకటి చొప్పున రిలీజ్‌ చేస్తున్నాను. తెలుగు ప్రేక్షకులు ఈ చిత్రాన్ని చూసి ఆదరిస్తారని మనస్పూర్తిగా కోరుకుంటు-న్నాను.

Advertisement

తాజా వార్తలు

Advertisement