Saturday, May 18, 2024

భారత్ లో సరికొత్తగా రియల్‌మీ 10 ప్రో 5 జి Coca-Cola ఎడిషన్..

చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీదారు సంస్థ‌ రియల్‌మీ ఇవ్వాల (శుక్రవారం) ఓ కొత్త మెడ‌ల్ ఫోన్ ను రిలీజ్ చేసింది. రియల్‌మీ 10 ప్రో 5 జి కోకా-కోలా ఎడిషన్ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. రూ.20,999 ధరతో ఈ స్మార్ట్‌ఫోన్ ఇండియా ఈ కామ‌ర్స్ వెబ్‌సైట్ – ఫ్లిప్‌కార్ట్ అండ్ సెలెక్టెడ్ ఆఫ్‌లైన్ స్టోర్‌లలో ఫిబ్రవరి 14 నుండి అందుబాటులో రానుంది. ఈ క‌స్ట‌మైస్డ్ స్మార్ట్‌ఫోన్ కోకా-కోలా క్లాసిక్ డిజైన్ ఎలిమెంట్‌లను రెడ్ & బ్లాక్ షెడ్స్ తో ‘కోకా-కోలా’ బ్రాండింగ్‌తో వస్తుంది. ఫోన్ కి సంభందించి మ‌రిన్ని వివరాలు ఇలా…

రియల్‌మీ 10 ప్రో 5 జి కోకా-కోలా ఎడిషన్: స్పెసిఫికేషన్స్

Qualcomm Snapdragon 695 5G ప్రాసెసర్‌తో ఆధారితమైన ఈ స్మార్ట్‌ఫోన్ 6.72-అంగుళాల IPS LCD స్క్రీన్ 120Hz రిఫ్రెష్ రేట్, 680 nits పీక్ బ్రైట్‌నెస్ ని స‌పోర్ట్ చేస్తుంది. బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్ ఉండ‌గా అందులో 2MP డెప్త్ సెన్సార్ తోపాటు 108-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా సెన్సార్‌ను కలిగి ఉంటుంది. ఇక‌ ఫ్రంట్ సైడ్ అయితే 16MP కెమెరా సెన్సార్ ఉంది.

లాక్ స్క్రీన్ నుండి మొద‌లుకొని డైనమిక్ ఛార్జింగ్ ఎఫెక్ట్ వరకు.. ఈ స్మార్ట్‌ఫోన్ కోక్ రెడ్ అండ్ కోకా-కోలా బబుల్ ఎలిమెంట్‌తో క‌స్ట‌మైస్ అయింది. అంతేకాకుండా, ఫోన్‌లో కోకా-కోలా రింగ్‌టోన్ లిక్విడ్ బ‌బుల్స్ వచ్చే సౌండ్ ఉన్నాయి.

- Advertisement -

Realme 10 Pro Coca-Cola ఎడిషన్ 8GB + 128GB స్టోరేజ్ కాన్ఫిగరేషన్‌లలో వస్తుంది. 5,000 mAh బ్యాటరీతో ఈ ఫోన్ 33W ఫాస్ట్ వైర్డ్ ఛార్జింగ్‌కు స‌పోర్ట్ చేస్తంది. ఇందులో జియోమాగ్నెటిక్ సెన్సార్, లైట్ సెన్సార్, డిస్టెన్స్ సెన్సార్, గైరోస్కోప్, యాక్సిలరేషన్ సెన్సార్స్ ఉన్నాయి. ఇతర ఫీచర్లలో స్టోరేజ్ ఎక్స్ పాన్ష‌న్ కోసం మైక్రో SD కార్డ్ స్లాట్, Wi-Fi, బ్లూటూత్, 3.5mm ఆడియో జాక్, డ్యూయల్-సిమ్ సపోర్ట్, ఛార్జింగ్ అండ్ డేటా ట్రాన్స్ ఫర్ కోసం USB-C పోర్ట్ కూడా ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement