Thursday, May 9, 2024

కొత్త హీరో న‌టిస్తున్న సిద్దార్ధ్ రాయ్

బాలకృష్ణ, ప్రభాస్‌, అల్లు అర్జున్‌, మహేష్‌ బాబు, రవితేజ వంటి అగ్ర హీరోలతో పాటు- త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌, సుకుమార్‌, బోయపాటి శ్రీను వంటి దర్శకులతో అతడు, ఆర్య, పౌర్ణమి, భద్ర, లెజెండ్‌ వంటి చిత్రాల్లో నటించిన బాల నటుడు దీపక్‌ సరోజ్‌.. హీరోగా పరిచయం అవుతున్నాడు. జయ అడపాక, ప్రదీప్‌ పూడి, సుధాకర్‌ బోయినలు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రంతో హీరోగా అరంగేట్రం చేస్తున్నారు. హరీష్‌ శంకర్‌, వంశీ పైడిపల్లి వంటి పెద్ద దర్శకుల దగ్గర పనిచేసిన వి యేశస్వి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు.


ఈ సినిమా -టైటిల్‌, ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ఈ చిత్రానికి ‘సిద్ధార్థ్‌ రాయ్‌ ‘అనే -టైటిల్‌ పెట్టారు. కాన్సెప్ట్‌ పోస్టర్‌ను హరీష్‌ శంకర్‌ ఆవిష్కరించగా, అల్లు అరవింద్‌ ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను విడుదల చేశారు. ‘ఎన్‌ ఎక్‌ సెంట్రిక్‌ లైఫ్‌ స్టొరీ’ అనేది సినిమా ఉప శీర్షిక. రెండు పోస్టర్లు విడుదలచేశారు ఒక పోస్టర్‌లో దీపక్‌ సరోజ్‌ నోట్లో రెండు సిగ రెట్లతో, చేతిలో ఎర్ర గు లాబీని పట్టు-కుని కని పిస్తున్నాడు. పొడవాటి జుట్టు- గడ్డం తో, దీపక్‌ తన దుస్తుల మొత్తం రక్తంతో కనిపి స్తున్నాడు. మరో పోస్టర్‌ లో లవర్‌ పాత్ర పోషిం చిన తన్వి నేగితో లిప్‌ లా క్‌ చేస్తూ కనిపించాడు .
ఈ చిత్రం ఇప్పటికే హైదరాబాద్‌, వైజాగ్‌లో షూటింగ్‌ జ రుపుకుంది. వేసవికి విడుదల చేసేలా ప్లాన్‌ చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement