Thursday, May 2, 2024

మ్యూచువల్‌ ఫండ్స్‌కు కొత్త మార్గదర్శకాలు.. యూనిట్‌ హోల్డర్ల ప్రయోజనాలకు సెబీ ఆదేశాలు

మ్యూచువల్‌ ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టేవారి ప్రయోజనాల పరిరక్షణకు సెబీ ఎంఎఫ్‌ సంస్థలకు కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది. ట్రస్టీల జవాబుదారితనం పెంచేలా సెబీ చర్యలు తీసుకుంది. మ్యూచువల్‌ ఫండ్‌ కంపెనీల బోర్డు జవాబుదారితనం పెంచాలని సెబీ ఏఎంసీలకు సూచించింది. మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థలు చేసే ప్రకటనలకు ఒక కామన్‌ ప్లాట్‌ఫామ్‌ ఉండాలని కూడా సెబీ సూచించింది. అన్ని మ్యూచువల్‌ ఫండ్స్‌ ఉత్పత్తులు, సేవలకు సంబంధించి యూనిట్‌ హోల్డర్ల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థల నిర్ణయాలపై ఇండిపెండెంట్‌ సమీక్ష చేసేందుకు యూనిట్‌ హోల్డర్‌ ప్రొటక్షన్‌ కమిటీ (యుహెచ్‌పీసీ) తప్పనిసరిగా ఉండాలని సెబీ సూచించింది. ఏఏంసీ బోర్డు దీన్ని ఏర్పాటు చేయాలని కోరింది.

అసెట్‌ మేనేజ్‌మెంట్‌ కమిటీ అసెట్స్‌ పెంచుకునేందుకు మ్యూచువల్‌ ఫండ్స్‌ను తప్పుగా విక్రయించే అంశాలను మ్యూచువల్‌ ఫండ్స్‌ ట్రస్టీలు దృష్టి పెట్టాలని సెబీ తన కన్సల్టేషన్‌ పేపర్‌లో కోరింది. ఏఎంసీలు వసూలు చేసే ఫీజులు, ఖర్చుల సరైనావేనా అనే విషయాకి ట్రస్టీలే బాధ్యత వహించాలని సెబీ పేర్కొంది. ఏఎంసీల పనితీరును సహచర సంస్థలతో సరిపోల్చాలని సూచించింది. ఏఎంసీ స్పాన్సర్‌కు ఎటువంటి అనవసర ప్రయాెెజనం లభించకుండా చూసుకోవాలని కోరింది. ప్రధానమైన అంశాల్లో కేవైసీ సరిగాలేని వాటిని ట్రస్టీలు కాలానుగుణంగా సమీక్షించాలని, వారు అందుకు బాధ్యత వహించాలని సెబీ కోరింది. ఏఎంసీల హామీలపై ఆధారపడకుండా ఏ మేరకు చెప్పిన వాటిని అమలు చేస్తుందో ట్రస్టీలు, వారి రిసోర్స్‌ పర్సన్స్‌ స్వతంత్రంగా అంచనా వేయాలని పేర్కొంది.

- Advertisement -

ట్రస్టీల పర్యవేక్షణకు ఏఎంసీలు విశ్లేషాత్మక సమాచారాన్ని అందించాల్సి ఉంటుంది. ప్రస్తుతం నిబంధనలు అమలు వంటి వాటిపై ట్రస్టీలు ప్రధానంగా ఏఎంసీలపై ఆధారపడుతున్నారు. నిబంధనల ప్రకారం యూనిట్‌ హోల్డర్ల ప్రయోజనం కోసం ట్రస్టీలు మ్యూచువల్‌ ఫండ్‌ ఆస్తిని ట్రస్ట్‌లో ఉంచుతారు. మ్యూచువల్‌ ఫండ్‌ కోసం స్కీమ్‌లను ప్లోట్‌ చేయడానికి, పెట్టుబడి లక్ష్యాలకు అనుగుణంగా వివిధ పథకాల కింద సమీకరించిన నిధులను నిర్వహించడానికి ట్రస్టీలు ఏఎంసీలను నియమిస్తారు. ప్రస్తుతం మ్యూచుల్‌ ఫండ్స్‌ పరిశ్రమకు ఆదరణ పెరుగుతున్నందున ట్రస్టీల ప్రాత కీలకంగా మారిందని సెబీ పేర్కొంది.

గత 10 సంవత్సరాల్లో మ్యూచువల్‌ ఫండ్‌ ఇండస్ట్రీ ఐదు రేట్లు పెరిగింది.. అసెట్స్‌ అండర్‌ మేనేజ్‌మెంట్‌ (ఏయూఎం) 2012లో 7.93 లక్షల కోట్లు ఉంటే, డిసెంబర్‌ 2022 నాటికి 39.89 లక్షల కోట్లకు చేరినట్లు సెబీ తెలిపింది. ట్రస్టీలు తమ బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తున్నారని నిర్ధారించుకోవడానికి తమ తరపున తగిన సూచనలు ఇచ్చేందుకు ఆడిట్‌ సంస్థలు, చట్టపరమైన సంస్థలు, మర్చంట్‌ బ్యాంకర్లు వంటి వృత్తిపరమైన సంస్థలపై ఆధారపడవచ్చని సెబీ సూచించింది. ట్రస్టీలు నిర్వహించగలిగే కొన్ని విధులను కూడా సెబీ పేర్కొంది. ఏదైనా ప్రొడక్ట్‌ను ఏఎంసీ లాంచ్‌ చేసే ముందు అన్ని సిస్టమ్స్‌ సరిగా ఉన్నాయా అన్నిది పరిశీలించాలని సూచించింది. యూనిట్‌ హోల్డర్లకు ఏదైనా ఫండ్‌ ద్వారా ఆదాయం వస్తుందా అన్నది కూడా పరిశీలించాలని కోరింది. ప్రస్తుతం ఉన్న ట్రస్టీలు బోర్డ్‌ ఆఫ్‌ ట్రస్టీలు, ట్రస్టీ కంపెనీగా మారేందుకు ఒక సంవత్సర కాలం ఇస్తున్నట్లు సెబీ తెలిపింది. ప్రస్త్తుతం కార్పొరేట్‌, బోర్డు ఆఫ్‌ ట్రస్టీలు రెండు విధానాలు అమల్లో ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement