Monday, May 13, 2024

హ్యుందాయ్‌ నుంచి కొత్త క్రెటా నైట్‌..

న్యూఢిల్లి : దక్షిణకొరియా ఆటోమొబైల్‌ దిగ్గజం హ్యుందాయ్‌ భారత మార్కెట్లలోకి సరికొత్త క్రెటా నైట్‌ ఎడిషన్‌ వేరియంట్‌ను త్వరలోనే లాంచ్‌ చేయనుంది. ఈ కారుకు సంబంధిన వివరాలను కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపర్చింది. హ్యుందాయ్‌ క్రెటా నైట్‌ ఎడిషన్‌కు సంబంధించిన ఫోటోలు ఆన్‌లైన్‌లో హల్‌చల్‌ చేస్తున్నాయి. పెట్రోల్‌, డిజీల్‌ వేరియంట్లలో కొనుగోలుదారులకు అందుబాటులో ఉండనున్నట్లు తెలుస్తోంది.

కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌ ప్రకారం నైట్‌ ఎడిషన్‌ మోడల్‌ అందుబాటులో ఉంది. దీని ధర రూ.13.35 లక్షలు (ఎక్స్‌షోరూమ్‌) నుంచి ప్రారంభం కానున్నాయి. అయితే ఈ హ్యుందాయ్‌ నైట్‌ ఎడిషన్‌ కారు పూర్తిగా బ్లాక్‌ కలర్‌ బ్లాక్‌ బీస్ట్‌గా కనిపించనుంది. ఇందులో ఉండే ఫీచర్స్‌ కస్టమర్లను మరింతగా ఆకట్టుకుంటుందని కంపెనీ పేర్కొంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement