Friday, May 3, 2024

స్కూల్స్ ఇప్పుడే ఓపెన్ చెయొద్దు: నీతి అయోగ్

దేశంలో కరోనా సేకండ్ వేవ్ ప్రభావం దాదాపు తగ్గింది. దీంతో కొన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు తమ తమ రాష్ట్రాలలో విద్యాసంస్థలను పునః ప్రారంభించేందుకు సిద్ధమయ్యాయి. ఇక తగిన జాగ్రత్తలు మధ్య విద్యార్థులకు ప్రత్యక్ష విద్యాబోధన చేయాలని నిర్ణయించాయి పలు రాష్ట్రాల ప్రభుత్వాలు. తాజాగా ఈ విషయం పై నీతి ఆయోగ్ సభ్యుడు స్పందించారు.

ప్రస్తుత సమయంలో విద్యా సంస్థలను పునః ప్రారంభించాలని నిర్ణయం తీసుకోవడం ఏమాత్రం సరైనది కాదు అంటూ నీతి అయోగ్ సభ్యుడు వీకే పాల్ అభిప్రాయం వ్యక్తం చేశారు. విద్యార్థుల ప్రాణాలను పణంగా పెట్టి ఇలాంటి నిర్ణయం తీసుకోవడం సరికాదన్నారు. పాఠశాలల్లో విద్యార్థులు, టీచర్స్, హెల్పర్స్ ఒకేచోట కూర్చుని ఉంటారు. తద్వారా వైరస్ వ్యాప్తికి అవకాశం ఉంటుంది. అందుకే ఇప్పట్లో విద్యాసంస్థలను తెరవాలి అనే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవడం మేలు. వ్యాక్సిన్ ఎక్కువ మందికి ఇచ్చిన తర్వాతనో లేదా వైరస్ పూర్తిగా తగ్గిన తర్వాతనో ఇలాంటి నిర్ణయం తీసుకోవడం మంచిది అని అభిప్రాయం వ్యక్తంచేశారు వి కె పాల్.

Advertisement

తాజా వార్తలు

Advertisement