Thursday, April 18, 2024

స్టాండప్ రాహుల్…వర్ష బొల్లమ్మ ఫస్ట్ లుక్

ఉయ్యాలా జంపాలా సినిమాతో హీరోగా ఇండస్ట్రీకు పరిచయం అయ్యారు యంగ్ హీరో రాజ్ తరుణ్. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ డూపర్ హిట్ అందుకుంది. ఆ తరువాత కూడా ఒకటి రెండు హిట్ లను కొట్టాడు రాజ్ తరుణ్. అయితే ప్రస్తుతం మాత్రం వరుస ఫ్లాప్ లతో ఇబ్బంది పడుతున్నారు. ఆ హిట్ కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాడు. కాగా ప్రస్తుతం సాంటో మోహన్ వీరంకి ని దర్శకుడిగా పరిచయం చేస్తూ డ్రీమ్ టౌన్ ప్రొడక్షన్స్ మరియు హైఫైవ్ పిక్చర్స్ ప‌తాకాల‌పై నంద్‌కుమార్ అబ్బినేని, భరత్ మగులూరి సంయుక్తంగా ఓ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో రాజ్ తరుణ్ హీరోగా నటిస్తున్నాడు. ఆ సినిమానే స్టాండప్ రాహుల్.

అయితే ఈ సినిమాలో రాజ్ తరుణ్ సరసన వర్ష బొల్లమ్మ నటిస్తున్నారు. కాగా ఈ రోజు ఆమె ఫస్ట్ లుక్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఈ సినిమాలో వర్ష శ్రేయ రావు అనే స్టాండప్ కమెడియన్ రోల్ చేస్తోంది. డిఫరెంట్ ఇమేజెస్ తో ఉన్న వర్ష బొల్లమ్మ ఫస్ట్ లుక్ పోస్టర్ అందర్నీ ఆకట్టుకుంటోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement