Tuesday, May 21, 2024

బెల్లంకొండ గ‌ణేశ్ హీరోగా స్వాతిముత్యం-సాంగ్ ప్రోమో రిలీజ్

స్వాతిముత్యం చిత్రంనుండి నీ చారెడు క‌ళ్లే చ‌దివేస్తూ ఉన్నా అనే సాంగ్ ప్రోమోని రిలీజ్ చేశారు చిత్ర యూనిట్. ఈ చిత్రంలో హీరోగా బెల్లంకొండ గ‌ణేశ్ న‌టిస్తున్నాడు.సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ సినిమాతో, లక్ష్మణ్ కె కృష్ణ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఈ సినిమాలో కథానాయికగా వర్ష బొల్లమ్మ కనిపించనుంది. మహతి స్వరసాగర్ ఈ సినిమాకి సంగీతాన్ని సమకూర్చాడు. కృష్ణకాంత్ సాహిత్యాన్ని అందించిన ఈ పాటను అర్మాన్ మాలిక్ – సంజన ఆలపించారు. హీరో హీరోయిన్లపై ఈ పాటను చిత్రీకరించారు .. బీట్ బాగుంది. పూర్తి సాంగ్ ను ఈ నెల 27వ తేదీన విడుదల చేస్తున్నట్టుగా చెప్పారు. టైటిల్ ను బట్టే ఇది లవ్ ను టచ్ చేస్తూ సాగే ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని తెలుస్తోంది. చిన్న సినిమాగా కనిపిస్తున్నప్పటికీ, సితార వంటి పెద్ద బ్యానర్ లో ఈ సినిమా వస్తోంది. బెల్లంకొండ గ‌ణేశ్ కి ఇది మొద‌టిచిత్రం.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement