Thursday, May 2, 2024

రేపటి నుంచి దేశమంతా సింగిల్ యూజ్ ప్లాస్టిక నిషేధం..

జులై 1 నుంచి దేశమంతా ప్లాస్టిక్‌ వాడకం, ఉత్పత్తి, అమ్మకాన్ని కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. ప్రపంచంలో ఇప్పటికే 77 దేశాలు పూర్తిగా దీన్ని నిషేధించాయి. మరికొన్ని దేశాలు పాక్షికంగా ప్లాస్టిక్‌ను నిషేధించాయి. నిత్యం మనం ఉపయోగించే స్ట్రాలు, ప్లాస్టిక్‌ గ్లాసులు, ప్లాస్టిక్‌ ప్లేట్లు, కవర్లు వంటివి వందల సంవత్సరాలు భూమిలో కలిసి పోకుండా అలాగే ఉండిపోతున్నాయి. జులై 1 నుంచి సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ను పూర్తిగా నిషేధిస్తున్నారు. ప్లాస్టిక్‌ వ్యర్ధాలను అత్యధికంగా విడుదల చేస్తున్న దేశాల్లో మన దేశం మూడో స్థానంలో ఉంది. 2019-20 సంవత్సరంలో కేంద్ర పొల్యూ షన్‌ కంట్రోల్‌ బోర్డు విడుదల చేసిన నివేదిక ప్రకారం మన దేశంలో 34 లక్షల 69 వేల 780 టన్నుల ప్లాస్టిక్‌ వ్యర్ధాలను విడుదలయ్యాయి. సగటున ప్రతి మనిషి 4 కేజీల ప్లాస్టిక్‌ వ్యర్ధాలకు కారణం అవుతున్నారు. మరో రెండు సంవత్సరాల్లో ప్లాస్టిక్‌ వ్యర్ధాలు 50 లక్షల టన్నులకు చేరుకుంటాయని అంచనా.

50 మైక్రాన్ల కంటే తక్కువ మందం ఉండే ప్లాస్టిక్‌ సంచులను సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌గా పిలుస్తున్నారు. ప్లాస్టిక్‌ వేస్ట్‌మేనేజ్‌మెంట్‌ రూల్స్‌ ప్రకారం ఒకసారి వాడి పడేసే అన్ని ప్లాస్టిక్‌ వస్తువులను సింగిల్‌ యూజ్‌గానే పరిగణిస్తారు. మనం రోజువాడే స్ట్రాలు, ప్లాస్టిక్‌ వాటర్‌ బాటిల్స్‌ , సోడా, కూల్‌ డ్రింక్‌ సీసాలు, ప్లేట్లు, కప్పులు, ఫుడ్‌ ప్యాకేజీ కవర్లు, ప్లాస్టిక్‌ ఇయర్‌ బడ్‌లు, సిగరేట్‌ ఫిల్టర్స్‌, ఇలా ఈ వస్తువుల జాబితా పెద్దదిగానే ఉంది ఏటా ఏర్పడుతున్న ప్లాస్టిక్‌ వ్యర్ధాల్లో కేవలం 9 శాతం వాటినే రీసైకిల్‌ చేస్తున్నారు. 12 శాతం వరకు కాల్చివేస్తున్నారు. 79 శాతం వరకు భూమిపైన, నదులు, నీటి వనరులు, సముద్రాల్లో ఉండిపోతున్నాయి. ప్లాస్టిక్‌ వ్యర్ధాలు భారీగా పెరిగిపోవడం వల్ల అనేక పర్యావరన, జీవ సంబంధ సమస్యలు వస్తున్నాయి. పాలిథీన్‌ సంచులపై ఇప్పటికే 25 రాష్ట్రాలు ఆంక్షలు అమలు చేస్తున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో వీటి వాడకంపై నిషేధం ఉన్నా, సరిగా అమలు కావడంలేదు. జులై నుంచి అమల్లోకి వస్తున్న‌ నిషేధాన్ని కేంద్ర పొల్యూషన్‌ బోర్డు స్వయంగా పర్యవేక్షించనుంది.

అన్ని రాష్ట్రాల పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డులు దీనిపై ఎప్పటికప్పుడు కేంద్ర బోర్డుకు సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. నిషేధిత ప్లాస్టిక్‌ వస్తువులను తయారు చేసే ఏ సంస్థ, కంపెనీకి పెట్రో కెమికల్‌ పరిశ్రమ ముడి సరకులు సరఫరా చేయడానికి వీలులేదని కేంద్రం నిషేధం విధించింది. నిషేధాన్ని ఉల్లంఘించే వారికి 5 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించనున్నారు. నిషేధిత జాబితాలో ఉన్న ప్లాస్టిక్‌ వస్తువులను తయారు చేస్తున్న పరిశ్రమకు గతంలోనే గడువు ఇచ్చారు. ఈ పరిశ్రమలు తమ ఉత్పత్తి చేస్తున్న వస్తువులను నిబంధనలకు అనుగుణంగా మార్చుకోవాల్సి ఉంటుంది. వీటిని మార్కెటింగ్‌ చేయడం కూడా నేరంగా పరిగణిస్తారు. స్థానిక అధికారులు నిషేధంలో ఉన్న ఏ ప్లాస్టిక్‌ వస్తువు ఉత్పత్తి కాకుండా గట్టి చర్యలు తీసుకోవాలని కేంద్ర పొల్యూషన్‌ బోర్డు కోరింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement