Tuesday, May 7, 2024

Big Story: జాతీయ ప్రాజెక్టులు నత్తనడక.. రహదారులు, రైల్వే, పెట్రోలియం పనుల్లో తీవ్రజాప్యం

రోడ్డు రవాణా, హైవేల విభాగంలో గరిష్టంగా 243 ప్రాజెక్టులు తీవ్ర జాప్యంలో ఉన్నాయి. రైల్వేలకు సంబంధించి 114, పెట్రోలియం రంగంలో 89 ప్రాజెక్టు పనులు నత్తనడక నడుస్తున్నాయని ప్రభుత్వ నివేదిక ఒకటి పేర్కొంది. రోడ్డు రవాణా, రహదారుల విభాగంలో 826 ప్రాజెక్టులకు గాను 243 పనులు ఆలస్యమవుతున్నాయి. అక్టోబర్‌ 2022 మౌలిక సదుపాయాల ప్రాజెక్టులపై తాజా నివేదిక ప్రకారం, రైల్వేలో 173 ప్రాజెక్టులలో 114 ఆలస్యమవుతున్నాయి. పెట్రోలియం రంగంలో 142 ప్రాజెక్ట్‌లలో 89 ఆలస్యం అయ్యాయి.

ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అండ్‌ ప్రాజెక్ట్‌ మానిటరింగ్‌ డివిజన్‌ (ఐపిఎండీ) కేంద్ర రంగ మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల వ్యయాన్ని పర్యవేక్షించడానికి తప్పనిసరి చేయబడింది. ప్రాజెక్ట్‌ అమలు చేసే ఏజెన్సీలు ఆన్‌లైన్‌ కంప్యూటరైజ్డ్‌ మానిటరింగ్‌ సిస్టమ్‌ (ఒసిఎంఎస్‌)పై అందించిన సమాచారం ఆధారంగా ఈ ప్రాజెక్టుల విలువ 150 కోట్లు అంతకంటే ఎక్కువ. ఐపిఎండి స్టాటిస్టిక్స్‌, ప్రోగ్రామ్‌ ఇంప్లిమెంటేషన్‌ మంత్రిత్వ శాఖ క్రిందకు వస్తుంది.

  • మునీరాబాద్‌-మహబూబ్‌నగర్‌ రైలు ప్రాజెక్టు అత్యంత ఆలస్యమైన ప్రాజెక్టుగా నివేదికలో తేలింది. ఇది 276 నెలలు ఆలస్యం అవుతుంది.
  • రెండవ అత్యంత ఆలస్యమైన ప్రాజెక్ట్‌ ఉధంపూర్‌-శ్రీనగర్‌-బారాముల్లా రైలు ప్రాజెక్ట్‌, ఇది 247 నెలలు ఆలస్యమైంది.
  • మూడవ ఆలస్య ప్రాజెక్ట్‌, బేలాపూర్‌-సీవుడ్‌-ఆర్బన్‌ ఎలక్ట్రిఫైడ్‌ డబుల్‌ లైన్‌. ఇది 228 నెలలు జాప్యం.
  • 642 ప్రాజెక్ట్‌లు వాటి అసలు షెడ్యూల్‌ కంటే ఆలస్యమయ్యాయి. 79 ప్రాజెక్ట్‌లు గత నెలలో నివేదించిన షెడ్యూల్‌ను కూడా దాటిపోయాయి. అదనపు ఆలస్యాన్ని నివేదించాయి. ఈ 79 ప్రాజెక్ట్‌లలో 32 మెగా ప్రాజెక్ట్‌ల విలువ రూ. 1,000 కోట్లు అంతకంటే ఎక్కువ.
Advertisement

తాజా వార్తలు

Advertisement