Thursday, April 25, 2024

క్యాస్టింగ్ కౌచ్ పై ఇన‌యా.. సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

బిగ్ బాస్6 హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాక ఇన‌యా బాగా పాపుల‌ర్ అయింది. టైటిల్ రేసులో దూసుకుపోతోంది ఇనయా. ముఖ్యంగా ప్రతి వారం కంటెస్టెంట్ లు అందరూ ఈమెనే టార్గెట్ చేస్తూ ఉండడంతో ఈమెకు బాగా సింపతి పెరిగి ఓట్ల శాతం ఎక్కువగా పెరిగింది. ముఖ్యంగా ఇనయా ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ‌తో వ కలిసి డాన్స్ చేయడంతో ఒక్కప్పుడు బాగా పాపులర్ అయింది. ఆ పాపులర్ తోనే ఈమెకు బిగ్ బాస్ నుండి ఆఫర్ వచ్చినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అలా బిగ్ బాస్ ఎంట్రీ తో సెలబ్రిటీగా మారిపోయింది.

హౌస్ లో ఉండగానే బీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది ఇనయా.బిగ్ బాస్ -6 టైటిల్ని ఎలాగైనా గెలుచుకోవాలని హౌస్ లోకి వెళ్లకముందే ఎన్నో ఇంటర్వ్యూలలో తెలియజేసింది. అలాగే క్యాస్టింగ్ కౌచ్ పైన కూడా నోరు విప్పింది ఈమె. క్యాస్టింగ్ కౌచ్ అనేది లేదు అని చెప్పలేను కానీ ఇష్టం లేకుండా ఏ పని చేయలేం.. అందుకే చాలా ఆఫర్లు వచ్చిన తను వదులుకోవలసి వచ్చిందని తెలియజేసింది. క్యాస్టింగ్ కౌచ్ అనేది అందరి విషయంలో ఒకేలా ఉండదు. ఒక్కొక్కరికి ఒక్కో విధంగా ఉంటుందని తెలియజేస్తోంది ఇనయా. తను కూడా ఇలాంటివి ఎదుర్కొన్నానని చాలామంది అడిగారని ఆ పని ఇష్టం లేక సినిమాలను వదులుకున్నానని తెలియజేస్తోంది. ఆరోజు ఆ పనికి ఒప్పుకుంటే ఇప్పటికీ పెద్ద ప్రాజెక్టులు చేసేదాన్ని అని తెలియజేస్తోంది. అంతేకాకుండా ఒక మంచి యాక్టర్ కావాలన్నదే తన కోరిక అని ఇలాంటివి కాదని తెలియజేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement