Tuesday, May 14, 2024

అనుకున్నంత వేగంగా అడుగులు పడటం లేదు.. ఉక్రెయిన్‌తో యుద్ధంపై రష్యా

ఉక్రెయిన్‌పై యుద్ధం అంతా అనుకున్నట్టే జరుగుతోందని రష్యా రక్షణమంత్రి సెర్జీ షోయ్‌గు చెబుతున్నదానికి భిన్నమైన వాదనలు బయటకు వెల్లడవుతున్నాయి. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌కు అత్యంత సన్నిహుతుడైన నేషనల్‌ గార్డ్‌ చీఫ్‌ విక్టర్‌ జొలొతోవ్‌ యుద్ధం సాగుతున్న తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారని తెలుస్తోంది. అనుకున్నంత వేగంగా అడుగులు పడటం లేదని, ఉక్రెయిన్‌ నుంచి ఇంతటి ప్రతిఘటన ఊహించలేదని ఆయన అభిప్రాయపడ్డారు.

జొలోతోవ్‌ ఒకప్పుడు పుతిన్‌ వ్యక్తిగత భద్రత విభాగానికి ఇన్‌చార్జ్‌గా వ్యవహరించారు. ఆదివారంనాడు ఆయన ప్రఖ్యాత ఆర్థడాక్స్‌ పేట్రియార్క్‌ కిరిల్‌ చర్చలో ఒక కార్యక్రమంలో పాల్గొని కీలక వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్‌లో సైనిక చర్య వేగంగా సాగడంలేదని అభిప్రాయపడ్డారు. అయితే అనుకున్న లక్ష్యాన్ని ఒక్కో అడుగు వేస్తూ చేరుతామని, విజయం తప్పక లభిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement