Thursday, December 7, 2023

సెప్టెంబర్‌ 24 నుంచి నేషనల్‌ ఫుట్‌బాల్‌ టోర్నీ

డా.బీసీ రాయ్‌ ట్రోఫీ 2023-24 నేషనల్‌ ఫుట్‌బాల్‌ చాంపియన్‌షిప్స్‌ టోర్నమెంట్‌ సెప్టెంబర్‌ 24 నుంచి అక్టోబర్‌ 8 వరకు జరుగనుంది. జబల్‌పూర్‌ (మధ్యప్రదేశ్‌), అమృత్‌సర్‌ (పంజాబ్‌) వేదికలుగా టోర్నీ నిర్వహించనున్నట్లు అఖిలభారత ఫుట్‌బాల్‌ సమాఖ్య ఒక ప్రకటనలో వెల్లడించింది. టైర్‌-2 జూనియర్‌ బాయ్స్‌, టైర్‌-1 సబ్‌ జూనియర్‌ గర్ల్స్‌ విభాగాల్లో టోర్నీ జరగనుంది.

- Advertisement -
   

మొత్తం 20 జట్లు పాల్గొంటున్నాయి. 4 గ్రూపులుగా విభజించి, మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. సెమీఫైనల్స్‌, ఫైనల్‌ మ్యాచ్‌లన్నీ జబల్‌పూర్‌ జరుగనున్నాయి. సబ్‌ జూనియర్‌ గర్ల్స్‌ టోర్నీ మాత్రం సెప్టెంబర్‌ 3 నుంచి 13 వరకు అమృత్‌సర్‌లో నిర్వహిస్తున్నట్లు ఏఐఎఫ్‌ఎఫ్‌ పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement