Sunday, April 28, 2024

విమ్స్‌లో నాసల్‌ వ్యాక్సిన్‌ మూడో దశ ట్రైల్స్‌.. వలంటీర్లుకు అందించిన డైరెక్టర్‌ కె.రాంబాబు

విశాఖపట్నం, ప్రభన్యూస్‌: భారత్‌ బయోటెక్‌ సంస్థ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని ముక్కు ద్వారా వ్యాక్సిన్‌ (నాసల్‌ వ్యాక్సిన్‌)పై పరిశోధన చేసేందుకు దేశంలోని 17 ఆసుపత్రులకు అనుమతులు జారీ చేయగా, ఏపీలోని విశాఖలోని విమ్స్‌ ఆసుపత్రికి కేంద్ర ప్రభుత్వం అవకాశం కల్పించింది. దీనిలో భాగంగానే ఇప్పటికే విమ్స్‌లో రెండు దశల్లో నాసల్‌ వ్యాక్సిన్‌ను ఉపయోగించే విధంగా ట్రైల్స్‌ను చేపట్టగా, తాజాగా శనివారం నాసల్‌ ఇంట్రామస్కులర్‌ వ్యాక్సిన్‌ మూడో దశ -టైల్స్‌ను రాష్ట్రంలో విశాఖ ఇన్స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్స్‌(విమ్స్‌)లో డైరెక్టర్‌ డాక్టర్‌ కె.రాంబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాధారణ వాక్సిన్‌తో పోల్చుకుంటే ఈ నాసల్‌ ఇంట్రామస్కులర్‌ వాక్సిన్‌ మెరుగైన ఫలితాలను ఇస్తుందని తెలిపారు. ఈ పరిశోధనకు ఇప్పటికే 39 మంది వాలంటీ-ర్లు ముందుకు రావడం జరిగిందని, తొలిరోజు నలుగురు వాలంటీ-ర్లకు ఈ వ్యాక్సిన్‌ అందించామన్నారు. దేశ వ్యాప్తంగా మూడు దశ -టైల్‌ను 3,160 మందికి అందించేలా చర్యలు తీసుకుంటున్నారని, అందులో ఈ డ్రాప్స్‌300 మందికి, 120 మందికి ఇంజక్షన్‌ ఇచ్చి రెండు ఫలితాలపై పరిశోధన చేయనున్నట్లు- తెలిపారు.

మొదటి,రెండు -టైల్స్‌లో మెరుగైన ఫలితాలను సాధించిందని ఈ వాక్సిన్‌ తీసుకున్నవారిలో అధిక మొత్తంలో యాంటీ-బాడీస్‌ ఉత్పత్తి అవటంతో పాటు- ఎటు-వంటి సైడ్‌ ఎఫెక్ట్స్‌ లేవన్నారు. డ్రాప్స్‌ ద్వారా వాక్సిన్‌ తీసుకోవటానికి ఎవరి సహాయం అవసరం ఉండదన్నారు. ఈ డ్రాప్‌ తీసుకోవాలనుకునే వారు 18 నుంచి 65 సంవత్సరాల మధ్య వయస్సు గల వారు ఇంతకుముందు వ్యాక్సిన్‌ తీసుకొని వారు ఈ డ్రాప్స్‌ను వేసుకోవచ్చు అన్నారు. ఆసక్తి ఉండి ఈ -టైల్స్‌ లో పాల్గొన్న అనుకునేవారు వచ్చి పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు ఈ -టైల్స్‌ అనర్హులను తెలిపారు. ఈ -టైల్స్‌ను ఐదు నెలల లోపు పూర్తి చేసి నివేదికను అందజేస్తామన్నారు.ఈ -టైల్స్‌ కు ప్రధాన పరిశోధకుడిగా డాక్టర్‌ కె. రాంబాబు, సహాయ పరిశోధకుడిగా డాక్టర్‌ విజయ్‌ కుమార్‌, సభ్యులుగా డాక్టర్‌ ఊర్మిలా, డాక్టర్‌ సఫీనా ఉన్నారన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement