Friday, March 29, 2024

ఆత్మహత్య చేసుకున్న ప్రతి రైతు కుటుబాన్ని ఆదుకుంటాం: జ‌న‌సేన చీఫ్ ప‌వ‌న్‌

అమరావతి, ఆంధ్రప్రభ: అప్పుల బాధలు తాళలేక కౌలు రైతుల జీవితాలు అర్ధంతరంగా రాలిపోతుంటే.. ఆ కుటు-ంబాలు పలుకరించే దిక్కులేక, పట్టించుకునే నాథుడు లేక ఇబ్బందులు పడుతున్న వేళ ‘నేనున్నానం’టూ జనసేన అధ్యక్షులు పవన్‌ కల్యాణ్‌ చేసిన కౌలు రైతు భరోసా యాత్ర ధైర్యాన్ని నింపుతూ సాగింది. ఇటీవల అనంతపురం జిల్లాలో 30 మంది కౌలు రైతు కుటు-ంబాలకు ఆర్థిక సాయం అందించిన పవన్‌.. శనివారం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో రోడ్డున పడిన అన్నదాతల కుటు-ంబాలకు భరోసా కల్పించారు. జనసేన కౌలు రైతు భరోసా యాత్రలో భాగంగా దెందులూరు, చింతలపూడి నియోజకవర్గాల్లో బలవన్మరణాలకు పాల్పడిన కౌలు రైతుల ఇళ్లకు వెళ్లి ఆ కుటుబాల కష్టాలు ఆలకించారు. కౌలు రైతుల కన్నీరు తుడిచేందుకు జనసేన పార్టీ ఉందన్న ధైర్యాన్ని నింపారు. ఇంటింటికీ వెళ్లి కష్టాల్లో ఉన్న ఆ కుటు-ంబాలను పలకరిస్తూ.. ఆత్మహత్యలకు కారణాలను ఓపికగా ఆలకించారు.

ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందక దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్న ఆ కుటుబాలకు జనసేన పార్టీ తరఫున అండగా ఉంటామని హామీ ఇచ్చారు. కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే ప్రభుత్వం నుంచి అందాల్సిన పరిహారం ఎందుకు అందలేదో విచారించి, వారికి న్యాయబద్దంగా అందాల్సిన రూ. 7 లక్షల పరిహారం అందే ఏర్పాటు- చేయాలని జిల్లా నాయకత్వానికి సూచించారు. మార్గమధ్యంలో జానంపేట నుంచి లింగపాలెం వరకు ఐదు కుటు-ంబాలను పరామర్శించి ఒక్కో కుటు-ంబానికి రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం అందచేశారు. చింతలపూడిలో జరిగిన రచ్చబండ కార్యక్రమంలో మరో 35 మందికి రూ. లక్ష చొప్పున ఆర్థిక సాయం అందజేశారు. మొత్తం 41 కుటుంబాలకు అండగా నిలుస్తూ. రూ. లక్ష చొప్పున అందించడంతోపాటు.. వారి బిడ్డల భవిష్యత్తు బాధ్యత జనసేన తీసుకుంటుందని భరోసానిచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement