Friday, April 26, 2024

ఓటీటీ స్ట్రీమింగ్ కి రెడీ అయిన న‌రేష్ ఉగ్రం..

అల్లరి నరేష్ హీరోగా.. విజయ్ కనకమేడల ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కిన‌ కాప్ డ్రామా ఉంగ్రం. ఈ కాప్ యాక్ష‌న్ డ్రామ్ ఈ నెల (మే) 5న థియేట‌ర్ల‌లో రిలీజ్ అయింది. ఇంటెన్స్, టఫ్, పవర్ ఫుల్ పోలీస్ గా నరేష్ నటన అందరి ప్రశంసలు అందుకుంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ రెడీ అయిన‌ట్టు తెలుస్తోంది. ఈ మూవీ వ‌చ్చే నెల (జూన్) 2 నుండి స్ట్రీమింగ్ కానుంది. టాప్ OTT ప్లాట్‌ఫారమ్ అమెజాన్ ప్రైమ్ స్ట్రీమింగ్ హక్కులను ఫ్యాన్సీ మొత్తానికి పొందింది.

ఈ సినిమాలో మృణా మీనన్ కథానాయికగా నటించగా, ఇంద్రజ, శరత్ లోహితాశ్వ, శత్రు, కౌశిక్ మహత, శ్రీనివాస సాయి, నాగ మహేష్, రమేష్ రెడ్డి, మణికంఠ వారణాసి ముఖ్య పాత్రలు పోషించారు. శ్రీచరణ్ పాకాల సంగీతం అందించగా, సిద్ధార్థ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. నరేష్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను మిస్ అయిన వారు 2 నుండి అమెజాన్ ప్రైమ్‌లో సినిమాను ఆస్వాదించవచ్చు.

Advertisement

తాజా వార్తలు

Advertisement