Sunday, April 28, 2024

శభాష్‌ ప్రజ్ఞానంద.. వరల్డ్‌ చెస్‌ చాంపియన్‌ కార్ల్ సన్‌ను ఓడించిన బుడ్డోడు..

ఎయిర్‌ థింగ్స్‌ మాస్టర్స్ లో ప్రపంచ నెంబర్‌ వన్‌ చెస్‌ ఛాంపియన్‌ మాగ్నస్‌ కార్ల్ సన్‌ను ఓడించి సంచలనం సృష్టించిన భారతదేశానికి చెందిన 16 ఏళ్ల కుర్రాడు ఆర్‌.ప్రజ్ఞానందను ప్రధాని నరేంద్ర మోడీ అభినందించారు. ట్విట్టర్‌ వేదికగా ప్రజ్ఞానంద్‌కు మోడీ అభినందనలు తెలిపారు. యువ మేధావి ఆర్‌.ప్రజ్ఞానంద విజయం పట్ల సంతోషిస్తున్నట్టు వివరించారు. ప్రముఖ చెస్‌ ఛాంపియన్‌ మాగ్నస్‌ కార్ల్‌సెన్‌పై విజయం సాధించినందుకు గర్విస్తున్నట్టు ప్రకటించారు. ప్రతిభావంతుడైన ప్రజ్ఞానందకు మంచి భవిష్యత్‌ ఉండాలని కోరుకుంటూ శుభాకాంక్షలు తెలిపారు. ఎయిర్‌ థింగ్స్‌ మాస్టర్స్‌ టోర్నీలోనే ఐదో అతిపిన్న వయస్కుడైన 16 ఏళ్ల ప్రజ్ఞానంద 8వ రౌండ్‌లో ప్రపంచ చెస్‌ నెంబర్‌ వన్‌ గ్రాండ్‌ మాస్టర్‌ కార్ల్‌సన్‌ను ఓడించి ఆశ్చర్యపరిచాడు.

నాకౌట్‌కు అర్హత సాధించని ప్రజ్ఞానంద..

అయితే వరల్డ్‌ నెంబర్‌ వన్‌ కార్ల్‌సన్‌ను ఓడించినప్పటికీ.. ఈ టోర్నీలో ప్రజ్ఞానంద నాకౌట్‌ పోరుకు అర్హత సాధించలేకపోయాడు. ఈ ఆన్‌లైన్‌ ర్యాపిడ్‌ చెస్‌ టోర్నమెంట్‌ను 11వ స్థానంతో ముగించాడు. ఈ టోర్నీలో నాకౌట్‌కు అర్హత సాధించాలంటే.. తొలి 8 స్థానాల్లో నిలవాల్సి ఉంటుంది. కానీ ప్రజ్ఞానంద 11వ స్థానంలో నిలిచి నాకౌట్‌ చేరే అవకాశాన్ని కోల్పోయాడు. అయితే కార్‌ ్లసన్‌ను ఓడించిన అనంతరం.. ప్రజ్ఞానంద మరో రెండు రౌండ్స్‌లో విజయం సాధించాడు. రష్యా ఆటగాడు నాడిర్‌బెక్‌ అబ్దుసట్టారావ్‌తో మ్యాచ్‌ను డ్రా చేసుకోగా.. 10, 12 రౌండ్స్‌లో అండ్రీ ఎసిపెంకో, అలెగ్జాండ్రా కోస్టిన్యూక్‌లను ఓడించాడు. కానీ దురదృష్టవశాత్తు నాకౌట్‌ పోరుకు అర్హత సాధించలేకపోయాడు. అంతకుముందు కార్‌ ్లసన్‌పై సాధించిన విజయం పట్ల ప్రజ్ఞానంద స్పందించాడు. వరల్‌ ్డ ఛాంపియన్‌ కార్‌ ్లసన్‌ను ఓడించినందుకు ఎంతో సంతోషంగా ఉందన్నాడు. కార్‌ ్లసన్‌తో ఆడిన మ్యాచ్‌లో తాను ప్రత్యేకంగా వ్యూహాలేమీ అమలు చేయలేదని చెప్పుకొచ్చాడు. కార్ల్‌సన్‌తో ఆడుతున్నంత సేపు ఎక్కువ ఒత్తిడికి గురికాకుండా ఆటను ఎంజాయ్‌ చేశానని తెలిపాడు. అలాగే ఈ విజయం తనలో చాలా ఆత్మవిశ్వాసాన్ని పెంచిందని చెప్పుకొచ్చాడు. భవిష్యత్తులోనూ ఇదే స్ఫూర్తితో ముందుకు వెళ్తానని స్పష్టం చేశాడు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement