Friday, April 26, 2024

ఎరువుల కొర‌త‌పై ప్ర‌ధాని మోడీకి నారా లోకేష్ లేఖ

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ఆంధ్రప్రదేశ్‌లో ఎరువుల కృత్తిమ కొరతను సృష్టిస్తున్న బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ప్రధాని మోదీకి, కేంద్ర మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌కు లేఖ రాశారు. సహకార సంఘాల ద్వారా పంపిణీ చేయాల్సిన ఎరువులను వైసీపీ ప్రభుత్వం ఆర్బీకేలకు మళ్లించిందని దుయ్యబట్టారు. బ్లాక్‌ మార్కెట్లో డీఏపీ 50 కిలోల బస్తాను రూ. 300కు అదనంగా కొనుగోలు చేసుకుంటున్నారని తెలిపారు. బ్లాక్‌ మార్కెటింగ్‌ను నివారించి రాష్ట్ర రైతాంగానికి డీఏపీ సరఫరాను మరింత పెంచాలని కోరారు. ఏపీలో ఎరువులు, డీఏపీ కృత్తిమ కొరతపై సమగ్ర విచారణ జరపాలని లేఖలో కోరారు. కేంద్రం రాష్ట్రానికి 2.25 లక్షల టన్నుల డీఏపీని కేటాయించినా బ్లాక్ మార్కెటింగ్‌, రాష్ట్ర ప్రభుత్వ అసమర్ధ విధానాలతో కృత్తిమ కొరత ఏర్పడిందని ఆరోపించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement