Wednesday, May 1, 2024

పుట్టిన రోజు సంబ‌రం..

సినీ నేపథ్యం లేకుండానే స్వయంకృషితో రాణించిన నటుల్లో నాని ఒకరు. అసిస్టెంట్‌ దర్శకుడు స్థాయి నుంచి హీరోగా ఎదిగారు. ప్రేక్షకుల్లో తనకంటూ స్థానం సంపాదిం చుకున్నారు. ఆయన శుక్రవారం పుట్టినరోజు జరుపుకుంటు-న్నారు. ఈ సందర్భంగా నాని నటిస్తున్న పాన్‌ ఇండియా చిత్రం ‘దసరా’ నుండి మాస్‌ అప్పీలింగ్‌ పోస్టర్‌ తో పాటు- గ్లింప్స్‌ వీడియో విడుదల చేశారు. పోస్టర్‌లో లుంగీ కట్టు-కున్న నాని కళ్ళజోడు ధరించి బీడీ తాగుతూ ఊర మాస్‌గా ఆకట్టు-కున్నా రు. ధరణిని ఘనంగా స్వాగతిస్తున్న డప్పు దరువులు కూడా పోస్టర్‌లో అలరిస్తున్నాయి.


గ్లింప్స్‌ వీడియోలో ధరణిగా నాని ఆడిన క్రికెట్‌ మెస్మరైజ్‌ చేసింది. లుంగీ కట్టు-కొని బీడీ తాగుతూ క్రీజ్‌ లో బ్యాట్‌ పట్టు-కొని బాల్‌ కోసం ఎదురుచూసిన ధరణి.. బాల్‌ ని సిక్సర్‌ గా మలిచి.. బ్యాట్‌ని గాల్లో విసిరేసి.. నడుచుకుంటూ రావ డం..ఆసక్తి కలిగిస్తోంది. అలాగే నాని పుట్టినరోజు సందర్భం గా దసరా చిత్రం కోసం తెలుగు రాష్ట్రాల్లోని 39 కేంద్రాల్లో కౌంట్‌డౌన్‌ ఇన్‌స్టాలేషన్‌లు ఏర్పాటు- చేశారు. సినిమా విడుద లకు కౌంట్‌డౌన్‌ ప్రారంభమై, విడుదల తేదీ వరకు ప్రతి రోజు థియేటర్లలో కటౌట్‌లను మారుస్తారు. శ్రీకాంత్‌ ఓదెల దర్శక త్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా మార్చి 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఎస్‌ఎల్‌వి సినిమాస్‌పై సుధాకర్‌ చెరుకూరి నిర్మించిన దసరా సినిమాపై భారీ అంచనాలున్నా యి. నానికి జోడిగా కీర్తి సురేష్‌ నటిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement