Monday, April 29, 2024

సైబ‌ర్ నేర‌గాళ్ల వ‌ల‌లో న‌గ్మా.. రూ. ల‌క్ష గోవిందా

ఈమ‌ధ్య‌కాలంలో సైబ‌ర్ నేరాలు ఎక్కువ‌య్యాయి. ప‌దే ప‌దే బ్యాంకు అధికారులు ఖాతాదారులు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని హెచ్చ‌రిస్తున్నా.. జ‌రిగేవి జ‌రుగుతూనే ఉన్నాయి. కాగా సీనియర్ హీరోయిన్ నగ్మా సైబర్ నేరగాళ్ల వలలో చిక్కార‌ట‌. తన ఫోన్ కి వచ్చిన ఒక మెసేజ్ క్లిక్ చేసి అడ్డంగా బుక్కయ్యారు. నగ్మా మొబైల్ కి బ్యాంకు వాళ్ళు పంపినట్లు ఒక మెసేజ్ వచ్చిందట. అందులో ఉన్న లింక్ ని నగ్మా క్లిక్ చేశారట. వెంటనే ఆమెకు ఫోన్ కాల్ వచ్చింది. బ్యాంకు ఎంప్లాయ్ గా పరిచయం చేసుకున్న మోసగాడు నేను మిమ్మల్ని గైడ్ చేస్తాను… కే వై సి కంప్లీట్ చేయమన్నాడట. నగ్మా ఎలాంటి బ్యాంకు డిటైల్స్ షేర్ చేయకున్నప్పటికీ నేరగాడు తన ఆన్లైన్ బ్యాంకు అకౌంట్ లోకి లాగిన్ అయ్యాడట. బెనిఫిషియరీ అకౌంట్ క్రియేట్ చేసుకుని దాదాపు లక్ష రూపాయలు ట్రాన్స్ఫర్ చేసుకున్నాడట. నేరగాడు లాగిన్ అయ్యే క్రమంలో మల్టీఫుల్ అటెంప్ట్స్ చేశాడని, తన మొబైల్ కి అనేక ఓటీపీలు వచ్చాయని నగ్మా వెల్లడించారు. పెద్ద అమౌంట్ కాకుండా కేవలం లక్ష రూపాయలతో ఈ ఫ్రాడ్ నుండి బయటపడినందుకు నగ్మా బాధలో సంతోషం వ్యక్తం చేశారు. నగ్మా అకౌంట్ నుండి ఒక నేషనల్ బ్యాంకుకి రూ. 99,998 ట్రాన్స్ఫర్ అయ్యాయి. నగ్మా కస్టమర్ గా ఉన్న సేమ్ బ్యాంకుకి చెందిన మరో 80 మంది కస్టమర్స్ ఇదే తరహాలో మోసపోయారట. సైబర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement