Thursday, May 9, 2024

హౌస్ మేట్స్ కి క్లాస్ పీకిన‌ నాగార్జున..స‌న్నీపై యానీ ఫైర్..

బిగ్ బాస్5 ఎనిమిద‌వ వారం నుంచి కాస్త ఇంట్రెస్టింగ్ గానే న‌డుస్తోంది. హోస్ట్ నాగార్జున కంటెస్టెంట్స్ ఫైర్ అయ్యారు. ఒక్కొక్క‌రి పేరు చెబుతూ వారి ఫొటోల‌ను ముక్క‌లు చేశారు. అంద‌రికీ క్లాస్ పీకారు..ఈ ఎపిసోడ్ అంతా సీరియ‌స్ గా కొన‌సాగింది. ఇక నాగార్జున ఎంట్రీ ఇచ్చి ముందుగా కెప్టెన్‏గా ఎన్నికైన షణ్ముఖ్ ని అభినందించాడు. ఆ త‌ర్వాత యాంకర్ రవిని దారుణంగా అవమానించాడు.. షణ్ముఖ్ బ్యాచ్‏తో మాట్లాడిన వీడియో క్లిప్ చూపించి మరీ క్లాస్ పీకాడు. నీకోసం రూల్స్ మార్చలేమని.. డబ్బు కోసం రాలేదు అంటున్నావ్.. ఇప్పుడే గేట్స్ ఓపెన్ చేస్తాను వెళ్లిపో అంటూ ఫైర్ అయ్యారు.. ఇక యానీ మాస్టర్ గివ్ అప్ ఇవ్వడం పై ప్రశ్నించిన నాగ్.. ఆ తర్వాత కాజల్ ను పద్దతిగా గేమ్ ఆడాలన్నారు. ఇక ఆ తర్వాత సన్నీ ఫోటో చింపేసి.. జైలుకు వెళ్లిన నీలో మార్పు రాలేదా అంటూ పైర్ అయ్యారు. ఇక ఆ తర్వాత ఇంటి సభ్యులతో వైకుంఠపాలీ ఆడించాడు నాగ్. ఇందులో ఎక్కువ మంది ఇంటి సభ్యులు కాజల్‏ను పాముతో పోల్చారు.

కాగా ఇంటి సభ్యులకు పూరీలు చేసే టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. ఇందులో హౌస్ మేట్స్ రెండు గ్రూపులుగా విడిపోయారు. యానీ మాస్టార్, శ్రీరామ్, విశ్వ, రవి, లోబో ఒక టీం కాగా.. మిగిలిన వారు రెండో టీంగా ఏర్పడ్డారు. అయితే ఇందులో ముందుగా కాజల్ టీం 50 చపాతీలు చేసినా.. సరిగ్గా లేవని యానీ మాస్టర్ టీంను విజేతగా ప్రకటించాడు షణ్ముఖ్. దీంతో సరిగ్గా లేవని.. కాదు.. ఎవరు ముందుగా చేసారనేది చూడాలని.. ఒకసారి రూల్స్ బుక్ సరిగ్గా చూసుకోవాలని సూచించాడు జైల్లో ఉన్న సన్నీ. ఇంకేముంది యానీ మాస్టర్ రెచ్చిపోయింది. నీకు నీ ఫ్రెండ్స్ కష్టం తప్ప మిగతవారిది కనిపించదా అంటూ యాద్దానికి దిగింది. ఇక మాట మాటా పెరిగి ఇద్దరూ సౌత్.. నార్త్ ఇండియా అంటూ ప్రాంతీయ విద్వేశాలను రెచ్చగొట్టేంతవరకు వెళ్లింది. అయితే వీరిద్దరి మధ్య గొడవ జరుగుతుంటే కెప్టెన్ గా ఉన్న షణ్ముఖ్ మాత్రం పక్కన కూర్చుని నవ్వుతున్నాడు. దీంతో సన్నీకి మరింత కోపం వచ్చేసింది. ఇద్దరూ గొడవ జరుగుతుంటే అలా ఎంజాయ్ చేయడం కరెక్ట్ కాదంటూ వారించాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement