Monday, April 29, 2024

పురుషులే కాదు మహిళలు తలాక్ చెప్పొచ్చు..

త్రిపుల్ తలాక్ ఇస్లాం ప్రకారం పురుషులు మహిళలకు విడాకులు ఇచ్చే సాంప్రదాయం. అయితే పురుషులే కాదు మహిళలు కూడా తలాక్ చెప్పి విడాకులు ఇవ్వొచ్చని కేరళ హై కోర్టు తీర్పునిచ్చింది. ముస్లిం మహిళలూ కోర్టుకు రావాల్సిన పనిలేకుండానే ఇస్లాం చట్టాల ప్రకారమూ విడాకులు తీసుకోవచ్చని తీర్పు చెప్పింది. ఫ్యామిలీ కోర్టుల్లో పరిష్కారం కాని వివిధ కేసుల విచారణ సందర్భంగా హైకోర్టు ఈ తీర్పును ఇచ్చింది. కోర్టుకు రాకుండా విడాకులు తీసుకునే హక్కు ముస్లిం మహిళలకు లేదని 1972లో కేసీ మోయిన్ వర్సెస్ నఫీసా తదితరులు కేసులో ఏకసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పును కొట్టివేసింది.

పవిత్ర ఖురాన్ ముస్లిం పురుషులు, మహిళలకు విడాకులు తీసుకునే విషయంలో సమాన హక్కులను కల్పించిందని జస్టిస్ ఎ. మహ్మద్ ముస్తాఖ్, జస్టిస్ సీఎస్ దియాస్ ల ధర్మాసనం వ్యాఖ్యానించింది. వివాహ ఒప్పందాన్ని తుదివరకు పాటించని భర్తకు తలాఖ్ ఈ తాఫీజ్ ద్వారా భార్య విడాకులు ఇవ్వొచ్చు. ఖులా ప్రకారం భార్యే ఏకపక్షంగా భర్త నుంచి విడాకులు తీసుకోవచ్చు. పరస్పర ఆమోదంతో ముబారాత్ ద్వారా భర్త నుంచి భార్య విడిపోవచ్చు. ఖాజీ అనే మధ్యవర్తుల ద్వారా ఫస్క్ పద్ధతిలో విడాకులను పొందవచ్చు.

Advertisement

తాజా వార్తలు

Advertisement