Tuesday, May 7, 2024

నీ య‌వ్వ‌.. మ్యూజిక్‌లోనే కాదు, మైదానంలోనూ దంచికొడుతుండుగా..

SS థమన్ సౌత్‌లో మంచి పేరున్న మ్యూజిషీయ‌న్‌. అంతేకాకుండా ఈ మ‌ధ్య ఓ టీవీ షో అయిన సూపర్ సింగర్ సీజన్ 10తో టెలివిజన్ ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. అయినప్పటికీ అతను ఒక ప్యాషనేట్ క్రికెటర్ అని చాలా మందికి తెలియదు. అతను హైద‌రాబాద్‌ శివార్లలోని స్టేడియాల్లో రాత్రిపూట మెగా హీరో సాయి ధరమ్ తేజ్ వంటి పరిశ్రమకు చెందిన స్నేహితులతో క్రికెట్ ఆడుతాడు. తన స్నేహితులతో క్రికెట్ ఆడటానికి మాత్రమే చెన్నై నుండి హైదరాబాద్‌కు వెళ్లిన సందర్భాలు చాలా ఉన్నాయి.

అయితే థమన్ ఈ మ‌ధ్య‌ మైదానంలో అడుగుపెట్టి త‌న స్నేహితుల‌తో క‌లిసి క్రికెట్ ఆడుతున్న వీడియోని షేర్ చేసాడు.. ఒక బాల్ ని బౌండ్రీ దాటించి సిక్స్ కొట్టినట్టు ఆ వీడియోలో క‌నిపిస్తోంది. అయితే ఆ త‌ర్వాత నెక్ట్ బాల్ స్టంప్‌పైకి ఫుల్ టాస్ ప‌డి అవుట్ అయ్యాను అంటూ క్యాప్ష‌న్ పెట్టాడు థ‌మ‌న్.. మ‌రి ఈ వీడియోను మీరూ చూసి జ‌ర ఎంజాయ్ చేయండి..

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement