Saturday, June 12, 2021

రఘురామను అనర్హుడిగా ప్రకటించాలి: ఎంపీ మార్గాని భరత్

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజుపై గుర్రుగా ఉన్న వైసీపీ ఆయనపై అనర్హత వేటు వేయించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. వైసీపీ ఎంపీ, లోక్ సభలో పార్టీ చీఫ్ విప్ మార్గాని భరత్ ఇవాళ ఢిల్లీలో లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాను కలిసి రఘురామకృష్ణరాజు అంశాన్ని చర్చించారు. రఘురామకృష్ణంరాజు పార్లమెంటు సభ్యత్వాన్ని రద్దు చేయాలని, ఆయనపై అనర్హత వేటు వేయాలని భరత్ విజ్ఞప్తి చేశారు. రాజ్యాంగం 10వ షెడ్యూల్ అనుసరించి పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని ఆయన ఉల్లంఘించారని ఆరోపించారు.

రఘురామ వైసీపీ గుర్తుపై నరసాపురం లోక్ సభ స్థానం నుంచి గెలుపొందారని, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని వెల్లడించారు. రఘురామ వ్యాఖ్యలకు సంబంధించిన ఆధారాలను తాము గతంలోనే లోక్ సభలో అందించామని భరత్ స్పీకర్ కు వివరించారు.

Advertisement

తాజా వార్తలు

Prabha News