Sunday, April 28, 2024

Movie: డోంట్ వ‌ర్రీ.. ఓన్లీ చెక‌ప్ కోస‌మే వెళ్లా: ర‌జ‌నీకాంత్‌

సూపర్ స్టార్ రజ‌నీకాంత్ చెన్నైలోని కావేరి హాస్పిట‌ల్‌లో చేరారు. నిన్న‌ 4.30 గంటలకు రజ‌నీ ఆస్ప‌త్రిలో చేరినట్టు కావేరీ హాస్పిటల్స్ వర్గాలు వెల్లడించాయి. అయితే అత‌ని ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన చెందాల్సింది ఏమీలేదని, సాధారణ హెల్త్ చెకప్ కోసమే వచ్చారని ఆయన ప్రతినిధులు తెలిపారు.

కొన్నాళ్లుగా ర‌జ‌నీకాంత్‌ రక్తపోటులో హెచ్చుతగ్గుల సమస్య ఎదుర్కొంటున్నారు. గతేడాది కూడా హైదరాబాద్ లో షూటింగ్ కోసం వచ్చి అస్వస్థతకు గురై అపోలో హాస్పిట‌ల్‌లో చికిత్స పొందారు. అనారోగ్య కారణాల వల్లే రాజకీయ పార్టీ ఏర్పాటు నిర్ణయాన్ని కూడా ర‌జ‌నీ ఉపసంహరించుకున్నారు. ఇటీవలే ఆయన ఢిల్లీలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం అందుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement