Saturday, May 25, 2024

జ‌గ‌ప‌తిబాబు ప్ర‌ధాన పాత్ర‌లో సింబా – ఫ‌స్ట్ లుక్ రిలీజ్

తండ్రి,విల‌న్,సోద‌రుడు ఇలా ఏ పాత్ర‌కైనా సిద్ధ‌మంటారు సీనియ‌ర్ న‌టుడు జ‌గ‌ప‌తిబాబు. కాగా ఆయ‌న ప్ర‌ధాన‌పాత్ర‌లో న‌టిస్తోన్న చిత్రం సింబా. కాగా సింబా..ఫ‌స్ట్ లుక్ రిలీజ్ అయింది. ఆదివారం..ప్రపంచ పర్యావరణ దినోత్సవం (జూన్ 5) సందర్భంగా మేకర్స్ ఈ ఫిల్మ్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ‘ది ఫారెస్ట్ మ్యాన్’ అనే ట్యాగ్ లైన్ తో తెరకెకకుతున్న ఈ సైన్స్ ఫిక్షన్‌ థ్రిల్లింగ్‌ సబ్జెక్ట్ కు డైరెక్టర్‌ సంపత్‌ నంది స్టోరి అందించారు. మురళీ మనోహర్‌ రెడ్డి దర్శకత్వం వహిస్తుండగా, సంప‌త్ నంది టీమ్ వ‌ర్క్స్ సమర్పణలో రాజ్ దాస‌రి ప్రొడక్షన్స్ బ్యాన‌ర్‌పై సంపత్‌ నంది, రాజేందర్‌ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ మూవీలో జగపతిబాబు ప్రకృతి తనయుడిగా అద్భుతమైన పాత్రను పోషిస్తున్నారు. అడవుల్లో నివసించే మాచోమ్యాన్‌గా జగపతిబాబును చూపించనున్నారు. ఫస్ట్ లుక్ పోస్టర్ ఆసక్తికరంగా ఉంది. భుజాలమీద చెట్లను మోసుకుంటూ వెళ్తున్న జగపతి బాబు చూపులు ఇంటెన్స్ గా ఉన్నాయి. ‘ప్రకృతి తనయుడు ఇతను…జగపతిబాబును ‘సింబా’గా పరిచయం చేయడానికి ఆనందిస్తున్నాం. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఫారెస్ట్ మ్యాన్‌ ‘సింబా’ను పరిచయం చేస్తున్నాం’ అని మేకర్స్ సోషల్ మీడియా వేదికగా తెలిపారు. ఈ పోస్ట‌ర్ లో జ‌గ‌ప‌తిబాబు లుక్ కొత్త‌గా ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement