Saturday, May 4, 2024

Exclusive | మూన్ మిషన్ చంద్రయాన్-3.. చంద్రుని కక్ష్యలోకి అంతరిక్ష నౌక‌

చంద్రుని ఉపరితలంపై నీటి అణువుల అన్వేష‌న కోసం భార‌త‌దేశం పతిష్టాత్మకంగా ప్రయోగించిన చంద్రయాన్-3 మిషన్ లో మరో కీలక ఘట్టం జరిగింది. చంద్రయాన్-3 ఇవ్వాల (శనివారం) చంద్రుని కక్ష్యలోకి ప్రవేశించినట్లు అంతరిక్ష సంస్థ ఇస్రో తెలిపింది. భూ కక్ష్యలను పూర్తి చేసుకున్న చంద్రయాన్ 3 రాత్రి ఏడు గంటల అనంతరం చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించినట్లు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) తెలిపింది.

ఈ ప్రయోగంలో అత్యంత కీలకమైన దశ చంద్రయాన్‌ను చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశపెట్టడం. అంతరిక్ష నౌక వేగాన్ని తగ్గించి కచ్చితమైన ప్రణాళికతో ట్రాన్స్ లూనార్ కక్ష్యలోకి చంద్రయాన్ 3 విజయవంతంగా ప్రవేశించింది. దాదాపు 18 రోజులపాటు చంద్రుడి కక్ష్యలో తిరగనున్న చంద్రయాన్-3 ఆగస్టు 23 లేదా 24న చంద్రుని ఉపరితలంపై దిగనుంది. అక్కడి నుంచి జాబిల్లిపై పరిశోధనలు కొనసాగుతాయి. ఇది విజయవంతమైతే, చంద్రుని దక్షిణ ధ్రువం సమీపంలో అడుగుపెట్టిన మొదటి దేశం భారతదేశం అవుతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement