Saturday, May 4, 2024

దేశవ్యాప్తంగా 51 మంది ఎంపీలపై మనీలాండరింగ్ కేసులు

దేశంలో ప్రజాప్రతినిధులపై ఉన్న కేసుల స్థితిగతులను అమికస్ క్యూరీ విజయ్ హన్సారియా సుప్రీంకోర్టుకు తెలిపారు. ఈ మేరకు మనీలాండరింగ్ కేసుల్లో 51 మంది ఎంపీలు, 71 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిందితులుగా ఉన్నట్లు నివేదిక సమర్పించారు. సీబీఐ ప్రత్యేక కోర్టుల్లో 151 కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు వివరించారు. 58 పెండింగ్ కేసుల్లో జీవితఖైదు శిక్షలు పడే అవకాశం ఉన్నట్లు చెప్పారు. 45 కేసుల్లో అభియోగాలు కూడా నమోదు కాలేదని అమికస్ క్యూరీ కోర్టుకు వివరించారు.

ప్రతిప్రతినిధులు కేసుల్లో చార్జిషీట్ దాఖలు ఆలస్యంపై సీజేఐ ఎన్వీ రమణ ప్రశ్నలు సంధించారు. మానవ వనరుల కొరత ప్రధాన సమస్యగా ఉందని, ప్రతి ఒక్కరూ సీబీఐ విచారణ కోరుతున్నారని సీజేఐ ఎన్వీ రమణ వ్యాఖ్యానించారు. జడ్జిల సంఖ్య, మౌలిక సదుపాయాలు ప్రధాన సమస్యలుగా ఆయన వివరించారు. పరిస్థితులు ఇప్పుడిప్పుడే చక్కబడుతున్నాయన్నారు. కుదిరితే ప్రత్యేక కోర్టుల ఏర్పాటుపై హైకోర్టులకు సూచిస్తామని ఎన్వీ రమణ అన్నారు. ఇప్పటికే చాలా హైకోర్టులు కేసుల స్థితిగతులపై నివేదిక ఇచ్చాయని తెలిపారు. హైకోర్టులు అందించిన నివేదికలను విశ్లేషించాల్సి ఉందన్నారు. విచారణ సంస్థలు కూడా మానవ వనరుల కొరతను ఎదుర్కొంటున్నాయని పేర్కొన్నారు.

ఈ వార్త కూడా చదవండి: మంత్రి గంగుల కమలాకర్‌కు ఫేక్ ఈడీ నోటీసులు

Advertisement

తాజా వార్తలు

Advertisement