Thursday, April 25, 2024

హైదరాబాద్ పాతబస్తీలో యువకుడిపై కత్తిపోట్లు

హైదరాబాద్ పాతబస్తీలో దారుణం చోటు చేసుకుంది. పెళ్లయిన అమ్మాయితో ప్రేమ వద్దన్న పాపానికి స్నేహితుడిపై ఓ వ్యక్తి కత్తితో దాడికి పాల్పడిన ఘటన జరిగింది. పాతబస్తీ రియాసత్ నగర్‌కు చెందిన అక్బర్ ఖాన్ పెళ్లయిన మహిళతో ప్రేమ అంటూ వెంటపడ్డాడు. విషయం తెలిసిన ఆమె భర్త…అక్బర్ స్నేహితుడైన మహమ్మద్ ఈస సహాయం కోరాడు. తన భార్య వెంటపడవద్దని అక్బర్‌కు చెప్పాలని ఈసను కోరాడు.

దీంతో పెళ్లయిన మహిళ వెంటపడవద్దని ఈస నచ్చ చెప్పడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన అక్బర్… స్నేహితుడు అని కూడా చూడకుండా ఈసపై కత్తితో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన ఈసను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు పరారీలో ఉన్న నిందితుడు అక్బర్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

ఈ వార్త కూడా చదవండి: హైదరాబాద్: టులెట్ బోర్డు పెట్టినందుకు రూ.2వేలు జరిమానా

Advertisement

తాజా వార్తలు

Advertisement