Thursday, April 25, 2024

బాలయ్య అల్లుడిని ఓడించా.. నా కొడుకును గెలిపించాడు

మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్(మా) ఎన్నికల్లో అధ్యక్షునిగా గెలిచిన విష్ణు.. తండ్రి మోహన్ బాబుతో కలిసి హీరో బాలకృష్ణను కలిశారు. బాలయ్య ఆశీర్వాదం తీసుకోవడానికి వెళ్లినట్లు తెలిపారు. అనంతరం మోహన్ బాబు మీడియాతో మాట్లాడుతూ.. సాధారణ ఎన్నికలలో బాలయ్య బాబు అల్లుడిని ఓడించడానికి తాను ప్రచారం చేశానని, మంగళగిరిలో నారా లోకేష్ ఓడిపోయారని అన్నారు. కానీ ఆయన అవేమీ మనసులో పెట్టుకోకుండా ‘మా’ ఎన్నికల్లో విష్ణుకి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారని, విష్ణుకి ఓటు వేసి.. గెలిపించారని తెలిపారు. కాగా, మా ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ ప్యానెల్ పై మంచు విష్ణు ప్యానెల్ గెలిచిన సంగతి తెలిసిందే.

ఇది కూడా చదవండి: జేబుకు చిల్లు: జేబుకు చిల్లు: మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

Advertisement

తాజా వార్తలు

Advertisement