Friday, April 26, 2024

యాసంగిపై అయోమయం

పాపన్నపేట (ప్రభన్యూస్‌): వరికి ప్రత్యామ్నాయంగా ఆముదం, ఆవాలు, వేరుశనగ, నువ్వులు, శనగ, పెసర, మినుములు, కూరగాయల పంటలు సాగు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఏటా రెండు సీజన్లలో వరి సాగు చేసే రైతులు, ప్రభుత్వం సూచించిన ఆరుతడి పంటల వైపు వెళ్లేందుకు ఇష్టపడటం లేదు. దీనికి పంటల వైపు వెళ్లేందుకు ఇష్టపడటంలేదు. దీనికి తోడు, ఆరుతడి పంటలు సాగు చేస్తే కొన్ని పంటల్లో పెట్టిన పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదు. విత్తనాలు, కూలీల ఖర్చులు తడిసి మోపెడవుతాయని, ఆరుతడి పంటల్లో రెండుమూడు సార్లు కలుపు తీస్తేగాని పంటపండే పరిస్థితి లేదు. అలాగే ఆరుతడి పంటల్లో కీలక దశలైన పూత, మొగ్గ, గింజ దశల్లో నీటి యాజమాన్యం కీలకం. ఈ సమయాల్లో ఏమాత్రం అశ్రద్ద చేసినా పంటలు పండే పరిస్థితి లేదు. వేరుశనగ వంటి పంటలు వేస్తే కోతులు పంటను నష్టపరిచే అవకాశముంది.

భూగర్భ జలాలు పైపైనే ఉండడంతో..
జిల్లాలో భూగర్భ జలాలు 2-3 మీటర్ల లోతులోనే ఉండటంతో భూమిలో తేమ శాతం ఎక్కువగా ఉంటుంది. ఒక్కసారి వర్షం కు రిస్తేనే దాదాపు 15 రోజుల వరకు తేమను కోల్పోదు. ఇలాంటి భూ ముల్లో వరి పంట లేదా చెరుకు సాగు చేయాల్సి ఉంటుంది. అయి తే చెరుకు ఫ్యాక్టరీ మూతపడడంతో రైతులందరు వరి పంటనే సాగు చేస్తున్నారు. దీంతో జిల్లాలో ప్రతీ సీజన్‌లో కనీసం వరి పంటను 3 లక్షల ఎకరాల్లో పండిస్తున్నారు. భూమిలో ఎప్పుడూ తేమ ఉండటంతో, ఆరుతడి పంటలకు సంబందించిన మొక్కల వేర్లకు సరైన ఆక్సిజన్‌ అందక పెరగవు, దిగుబడినివ్వవు. ఏటా వరి సాగు చేసే రైతులు నీరు ఎప్పుడు పారేలా లెవలింగ్‌ చేసు కు న్నారు. దీంతో పొలం మడుల్లో ఎప్పుడూ నీరు నిలిచి ఉంటుంది.

వరికి అనువైన వాతావరణం..
జిల్లాలో వరికి అనువైన సాగు నీటి వనరులతో పాటు వాతావరణం ఉంది. దీంతో వానాకాలంలో 2 లక్షల పైగా ఎకరాల్లో వరి సాగు చేస్తే, యాసంగిలో 3 లక్షల వరకు సాగు చేసే అవకాశం ఉంది. యాసంగి సీజన్‌ పంట కాలంలో పగటి ఉష్ణోగ్రతలు 35 డిగ్రీల సెంటిగ్రేడ్‌ వరకు ఉండడంతో కిరణజన్య సంయోగక్రియ అనుకున్న స్థాయిలో జరిగి గింజల్లో గట్టిదనంతో పాటు ఎక్కువ దిగుబడి వస్తుంది. కొంతమంది రైతులైతే వానాకాలంలో పత్తి, మొక్కజొన్న, కందులు, పెసర వంటి ఆరుతడి పంటలు వేసి యాసంగిలో వరి వేస్తుంటారు. ఎకరాకు 25-26 క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చినా, ప్రస్తుత ధర క్వింటాల్‌కు రూ.1,960 ప్రకారం రూ.49-50 వేల వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉంది. వరి పంటకు పెద్దగా పనిలేకపోవడంతో ట్రాక్టర్‌తో దున్నించి నాటువేసి రెండుమూడు సార్లు రసాయన ఎరువులు చల్లితే పంటపండే పరస్థితి ఉంది. కోతల సమయంలో హార్వెస్టర్లు రావడంతో పాటు గ్రామాల్లో అమ్ముకునే వెసులుబాటు ఉండటంతో రైతులు వరిని వదిలేందు కు వెనుకంజ వేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement