Wednesday, May 15, 2024

Modi Punch – కెసిఆర్ కుటుంబానికి మేలు జ‌ర‌గాలంటే బిఆర్ఎస్ కు ఓటేయండి.. మోడీ

భోపాల్ – తెలంగాణ ముఖ్య‌మంత్రి కెసిఆర్ కుటుంబానికి మేలు జ‌ర‌గాలంటే బిఆర్ఎస్ కు ఓటేయండి అంటూ ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ పిలుపు ఇచ్చారు..తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ ప్రధాని నేరుగా విమర్శలు గుప్పించారు. కేసీఆర్ కుమార్తె కవితకు లాభం చేయాలనుకుంటే బీఆర్ఎస్ కు ఓటు వేయాలని, మీ కుటుంబ సభ్యులకు మంచి జరగాలంటే బీజేపీకి ఓటు వేయాలని అన్నారు.

ఈ ఏడాది చివరి నాటికి తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్న‌ నేపథ్యంలో భోపాల్ లో నిర్వహించిన ఐదు రాష్ట్రాల బూత్ కమిటీల సమావేశంలో ఆయన ప్రసంగిస్తూ, కేసీఆర్ కుటుంబాన్ని టార్గెట్ చేశారు. అలాగే ప్రాంతీయ‌పార్టీలు కుటుంబ పార్టీలేన‌ని, ఆ పార్టీల‌లో స్వంత ప్ర‌యోజ‌నాలే త‌ప్ప ప్ర‌జ‌ల సంక్షేమం ప‌ట్ట‌దంటూ రీజిన‌ల్ పార్టీస్ పై మండిప‌డ్డారు.. దీనిలో భాగంగానే కెసిఆర్ ను మోడీ టార్గెట్ చేస్తూ వ్యంగ్యంగా వాగ్భాణాలు సందించారు…

Advertisement

తాజా వార్తలు

Advertisement