Monday, May 20, 2024

Punjab : 39 రోజుల్లో మూడు సార్లు పార్టీ మారిన ఎమ్మెల్యే

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో రాజ‌కీయాలు వేడెక్కాయి. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఓ కీలక నేత బీజేపీలో చేరారు. గతంలో బీజేపీలో ఉన్న హరగోవింద్‌పూర్ సిట్టింగ్ ఎమ్మెల్యే బల్వీందర్ సింగ్ లడ్డీ తిరిగి మళ్లీ సొంతగూటికే చేరారు. బీజేపీతో విడిపోయిన తర్వాత బల్వీందర్ సింగ్ లడ్డీ జనవరి 3న కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. కాంగ్రెస్ లో చేరిన కేవలం 39 రోజుల్లోనే మళ్లీ హస్తాన్ని వీడి కాషాయ కండువా కప్పుకున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత పర్తాప్ సింగ్ బజ్వా తమ్ముడు అయిన బజ్వాతో పాటు లడ్డీ డిసెంబరు 28న దేశరాజధాని ఢిల్లీలో కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరారు.

అయితే, కాషాయ పార్టీలో చేరిన 6 రోజుల తర్వాత, లడ్డీ తిరిగి కాంగ్రెస్ గూటికి చేరారు. పంజాబ్ వ్యవహారాల ఏఐసీసీ ఇన్‌ఛార్జ్ హరీష్ చౌదరి, సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీ సమక్షంలో పంజాబ్ పాలక సంస్థలో తిరిగి చేరారు. గురుదాస్‌పూర్ జిల్లాలోని హరగోవింద్‌పూర్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసినందుకు లడ్డీకి కాంగ్రెస్ టిక్కెట్ ఇచ్చేందుకు నిరాకరించింది. లడ్డీ స్థానంలో మన్‌దీప్ సింగ్‌ను కాంగ్రెస్ నామినేట్ చేసింది. అసంతృప్తితో ఉన్న లడ్డీ.. పార్టీలో చేసేదేమిలేక మళ్లీ సొంత పార్టీలో చేరారు. ఇలా ఆయ‌న 39 రోజుల్లోనే మూడుసార్లు పార్టీ మారారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement