Friday, May 3, 2024

BREAKING: ఎమ్మెల్యే మేకపాటి నా తండ్రి.. లేఖ విడుద‌ల చేసిన శివచరణ్ రెడ్డి..

నెల్లూరు జిల్లా ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర రెడ్డి వ్యవహారం మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డి కుమారుడిని తానేనని శివ చరణ్ రెడ్డి అనే వ్యక్తి బయటికొచ్చారు. చిన్నప్పటి నుంచి తనను రహస్యంగా ఉంచారని.. అయితే, తనకు కుమారుడు లేడని ఇటీవల తన తండ్రి చేసిన వ్యాఖ్యలతో మనస్తాపం చెంది బయటకు వచ్చానని శివచరణ్ రెడ్డి వెల్లడించారు. ఎమ్మెల్యే మేకపాటి నా తండ్రి అంటూ శివచరణ్ రెడ్డి లేక విడుదల చేశారు. మేకపాటి మాత్రం శివచరణ్‌ నా కొడుకు కాదంటున్నారు. తనకు కుమారుడే లేరని ఎమ్మెల్యే మేకపాటి స్పష్టం చేశారు. డబ్బుల కోసమే బ్లాక్‌ మెయిల్‌ చేస్తున్నాడని మండిపడ్డారు. శివచరణ్‌తో నాకు ఎలాంటి సంబంధం లేదని మేకపాటి తేల్చి చెప్పారు. మేకపాటి వ్యాఖ్యలపై శివచరణ్‌ స్పందించారు. నా ఊరు కొంపలో ఎవరిని అడిగినా వాస్తవం చెబుతారు.. నా సర్టిఫికెట్లన్నింటిలో మేకపాటి పేరు ఉంది.. ఐడెంటిటీ కోసమే నా తాపత్రయం అని శివచరణ్‌ రెడ్డి పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement