Tuesday, September 26, 2023

BIG BREAKING : కాసేపట్లో చంద్రబాబు-పవన్‌ భేటీ.. భవిష్యత్ కార్యాచరణపై చర్చ?

కాసేపట్లో చంద్రబాబుతో పవన్‌ కల్యాణ్‌ భేటీ కానున్నారు. చంద్రబాబు ఇంట్లో వీరిద్దరు కలుసుకోనున్నారు. ఏపీలో పరిణామాలపై చంద్రబాబు, పవన్‌ చర్చించనున్నారు. రోడ్‌ షోలు రద్దు, గోపై ప్రధానంగా చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఉప్పం పర్యటనలో ఆంక్షలపై చర్చించే అవకాశం కూడా ఉంది. అయితే ఈ నెల 12న శ్రీకాకుళంలో జనసేన యువశక్తి సభ నిర్వహించనుంది. ఆంక్షలపై ఇప్పటికే జనసేన అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. విపక్షాలను టార్గెట్‌ చేస్తోందంటున్న టీడీపీ, జనసేన మండిపడుతుంది. గతంలో పవన్‌ విశాఖ పర్యటనలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా.. అప్పుడు పవన్‌ను కలిసి చంద్రబాబు సంఘీభావం తెలిపారు. ఇప్పుడు కుప్పం పర్యటన తర్వాత చంద్రబాబు ఇంటికి పవన్‌ కల్యాణ్‌ రానున్నారు. పలు రాజకీయ అంశాలపై చర్చించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement