Saturday, May 4, 2024

Mission Sun – ఇస్రో నెక్ట్స్ ప్రాజెక్ట్ ‘ఆదిత్య L1’ … సెప్టెంబర్‌లో ప్ర‌యోగం ..

శ్రీహ‌రికోట – చంద్రయాన్‌-3 విజయంతో జోష్ ఉన్న ఇస్రో ఈసారి త‌న గురిని సూర్యుడిపై పెట్టింది.. ఇకపై సూర్యుడిపై పరిశోధనలు జరుపనున్నది. ఇందు కోసం ఆదిత్య మిషన్‌ను సెప్టెంబర్‌లో ప్రారంభించే అవకాశం ఉందని ఇస్రో చీఫ్‌ సోమ్‌నాథ్‌ వెల్లడించారు. సూర్యుడిపై పరిశోధనలకు ఆదిత్య మిషన్‌ను సెప్టెంబర్‌‌ తొలి ప్రయోగం చేపట్టనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఆదిత్య మిషన్‌ కోసం సన్నద్ధమవుతుందని తెలిపారు. గగన్‌యాన్‌ ప్రాజెక్టు ఇంకా ప్రోగ్రెస్‌లో ఉందని త్వరలోనే ఈ ప్రాజెక్టును చేపడుతామని సోమ్‌నాథ్‌ వివరించారు. సెప్టెంబర్‌ లేదంటే అక్టోబర్‌లో ఏదో ఒక మిషన్‌ను చేపడుతామని ప్రకటించారు.

క్రూ మాడ్యూల్‌, క్రూ ఎస్కేప్‌ సామర్థ్యాన్ని పరీక్షిస్తామని, పలు రకాల పరీక్షలు విజయవంతనమైన తర్వాత 2025 రోదసిలోకి వ్యోమగాములతో కూడిన నౌకను పంపుతామని ప్రకటించారు. ప్రస్తుతం చంద్రయాన్‌ ల్యాండర్‌, రోవర్‌ చక్కగా పని చేస్తున్నాయని సోమ్‌నాథ్‌ వివరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement