Wednesday, May 8, 2024

యూవీ బ్యానర్ లో మిస్ శెట్టి – మిస్టర్ పోలిశెట్టి

యూవీ బ్యాన‌ర్ లో తెర‌కెక్కుతున్న చిత్రానికి టైటిల్ ని ఫిక్స్ చేశారు. ఈ చిత్రంలో స్టార్ హీరోయిన్ అనుష్క‌ న‌టిస్తుంది. ఈ సినిమాకి ‘మిస్ శెట్టి – మిస్టర్ పోలిశెట్టి’ అనే టైటిల్ ను ఖరారు చేశారు. వారి అసలు పేర్లతో టైటిల్ సెట్ చేయడాన్ని విశేషంగానే చెప్పుకోవాలి. అనుష్కను ఫారిన్ బ్యాక్ గ్రౌండ్ లోను .. నవీన్ పోలిశెట్టిని నేపథ్యంలోను చూపించారు. తాను సింగిల్ గా ఉండటానికే ఇష్టపడుతున్నట్టుగా అనుష్క చెబుతుంటే, తాను మాత్రం కలవడానికీ .. ప్రేమ పేరుతో కలిసి పోవడానికి సిద్ధంగా ఉన్నట్టుగా నవీన్ పోలిశెట్టి చెబుతున్నాడు. మహేశ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను, ఈ వేసవిలో తెలుగు .. తమిళ .. మలయాళ .. కన్నడ భాషల్లో విడుదల చేయనున్నారు. చాలా గ్యాప్ త‌ర్వాత అనుష్క న‌టిస్తున్న చిత్రం ఇది.

Advertisement

తాజా వార్తలు

Advertisement