Wednesday, May 1, 2024

Miracle – చచ్చి బతికిన ప్రాణం!?..


ఆస్పత్రిలో చచ్చి.. ఇంటికి తీసుకువెళుతున్న క్రమంలో బతికిన ప్రాణం.. డాక్టర్లను షాక్‌కు గురిచేసింది. గతుకుల రోడ్డుపై వెళుతుండగా అంబులెన్స్ గుంతలో పడడంతో ఊహించని పరిణామం జరిగింది. ఆగిన గుండె కొట్టుకోవడం మొదలుపెట్టింది. ఈ విశేషం.. హర్యానాలో జరిగింది. కర్నాల్‌కు చెందిన 80 ఏళ్ల వృద్ధుడు చనిపోయాడని కుటుంబ సభ్యులు భావించి, అంత్యక్రియలకు ఏర్పాట్లు చేసి వెళుతుండగా.. హఠాత్తుగా ఊపిరి పీల్చుకున్నాడు. దీంతో ఒక్కసారిగా కుటుంబసభ్యులతో పాటు ఇతర వ్యక్తులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.

హైదరబాద్, ఆంధ్రప్రభ బ్యూరో :
హ‌ర్యానాలో జ‌రిగిన ఈ ఘ‌ట‌న అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది. ఓ వృద్ధుడిని పాటియాలా ఆసుపత్రి వైద్యులు వెంటిలేటర్‌ మీద చికిత్స నందిస్తున్నారు. అయితే ఊపిరి ఆగిపోవడంతో వృద్ధుడు మృతి చెందిన విషయాన్ని వైద్యులు కుటుంబ సభ్యులకు చెప్పారు. దీంతో వృద్ధుడి అంత్యక్రియలకు ఇంట్లో కుటుంబ సభ్యులు బంధువులకు, ఇరుగుపొరుగు రెడీ చేస్తున్నారు. ఆస్పత్రి నుంచి వృద్ధుడి మృత దేహాన్ని కుటుంబ సభ్యులు అంబులెన్స్ లో ఇంటికి తీసుకెళ్తుండగా అంబులెన్స్ టైరు గుంతలో పడింది. దీంతో వృద్ధుడు మళ్ళీ ఊపిరి పీల్చుకోవడం ప్రారంభించాడు. ఇది కుటుంబ సభ్యులు గమనించారు. పాటియానా మున్సిపాలిటీ మాజీ డిప్యూటీ చైర్మన్ బల్దేవ్ సింగ్ తండ్రి దర్శన్ సింగ్ గత కొన్ని ఏళ్లుగా గుండె జబ్బుతో బాధపడుతున్నాడు. ఆరోగ్యం విషమించడంతో చికిత్స నిమిత్తం పాటియాలాలోని ఓ ఆసుపత్రిలో చేర్చారు.

చికిత్స సమయంలో గుండె ఆగినట్టు డాక్టర్ల ధృవీకరణ

ఐసీయూలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న దర్శన్ సింగ్ ను గురువారం ఉదయం వైద్యులు తనిఖీ చేయగా గుండె కొట్టుకోవడం ఆగిపోయినట్లు గుర్తించారు. వెంటనే వైద్య సిబ్బంది ఇంజక్షన్లు ఇచ్చినా ఫలితం లేకపోయింది. దీంతో వెంటిలేటర్‌పై నుంచి దర్శన్ సింగ్ తొలగించిన వైద్యులు అతను మరణించినట్లు ట్లు నిర్ధారించారు. అయితే ఈ ప్రైవేట్‌ ఆస్పత్రిలో మరణ ధ్రువీకరణ పత్రం ఇవ్వలేదు.

అంబులెన్స్‌లో ఆగిన గుండెకు వచ్చిన కదలిక

బల్దేవ్ సింగ్ తెలిపిన వివరాల ప్రకారం.. దర్శన్ సింగ్ ను స్వగ్రామం పాటియాలాకు తిరిగి తీసుకువెళుతుండగా… కైతాల్‌లోని ధండ్ గ్రామ సమీపంలో రోడ్డుపై ఉన్న గుంతలో కారు టైరు పడిపోయింది. అనంతరం వృద్ధుడి శరీరంలో కదలిక వచ్చింది. అప్పుడు తన తండ్రి చేయి ఊపినట్లు బల్దేవ్ సింగ్ గుర్తించారు.

- Advertisement -

పరిశీలించి ఓకే చెప్పిన వైద్యులు

దర్శన్ సింగ్ ను కుటుంబీకులు మళ్ళీ వైద్యులకు చూపించారు. అప్పుడు వృద్ధుడి నాడి పరిశీలించిన వైద్యులు అతని నాడి కొట్టుకుంటున్నట్లు గుర్తించారు. వెంటనే వృద్ధుడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఆ ఆస్పత్రిలోని వైద్యులు దర్శన్ సింగ్ ని పరీక్షించారు. వృద్ధుడు ఊపిరి పీల్చుకోవడం గుర్తించారు. దీంతో అక్కడ డాక్టర్.. వృద్ధుడిని కర్నాల్‌లోని రావల్ ఆసుపత్రికి రెఫర్ చేశారు. ప్రస్తుతం ఆ వృద్ధుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. వృద్ధుడి రక్తపోటు (బీపీ) దాదాపు 80-90 ఉందని.. ఊపిరి పీల్చుకుంటున్నారని, వృద్ధుడిని బతికించేందుకు ప్రయత్నిస్తున్నామని వైద్యులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement