Sunday, April 28, 2024

Sexually Abused | అన్న, అతని ఫ్రెండ్ కలిసి ఆ పనిచేశారు..​ బాలికను 5 నెలల గర్భిణీగా తేల్చిన డాక్టర్లు

కేరళలోని మలప్పురం జిల్లాలో దారుణం జరిగింది. ఓ బాలికపై తన సొంత సోదరుడు, మరో వ్యక్తి వారి ఇంట్లోనే అఘాయిత్యానికి పాల్పడ్డ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చాలాకాలంగా జరిగుతున్న ఈ దారుణాన్ని బాలికి బయటికి చెప్పుకోలేకపోయింది. అయితే.. ఆ బాలికకు అస్వస్తతగా ఉండడంతో ఆస్పత్రికి తీసుకెళ్లగా డాక్టర్లు అయిదు నెలల గర్భిణి అని తేల్చేశారు.

– ఇంటర్నెట్​ డెస్క్​, ఆంధ్రప్రభ

తల్లిదండ్రులు బాలికను నిలదీయడంతో అసలు వాస్తవం బయటపెట్టింది. తనను బెదిరించి, చంపేస్తామని భయపెట్టి రోజూ లైంగిక దాడికి పాల్పడేవారని తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో వారు పోలీసులకు కంప్లెయింట్​ చేశారు. మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఇద్దరు యువకులను పోలీసులు మలప్పురంలో అరెస్టు చేశారు. నిందితుల్లో ఒకరు బాలిక సోదరుడు కాగా, మరొకరు ఆమె బంధువు. కాగా, ప్రస్తుతం ఆ బాలిక ఐదు నెలల గర్భిణి కావడం గమనార్హం.

అయితే.. ఆ బాలికను చైల్డ్ లైన్ నిర్వహిస్తున్న యూనిట్‌కు తరలించారు. 10వ తరగతి విద్యార్థినిపై లైంగిక వేధింపులు ఆమె ఇంట్లోనే జరిగాయి. హెల్త్​ బాగా లేకపోవడంతో ఆసుపత్రికి వెళ్లగా ఆమె ఐదు నెలల గర్భిణి అని తేలింది. బాలిక వాంగ్మూలాన్ని అనుసరించి 24 ఏళ్ల సోదరుడు, బంధువును అరెస్టు చేశారు. ఈ ఘటనలో ఇంకా ఎవరి ప్రమేయం అయినా ఉందా? అనే కోణంలో విచారణ జరుపుతామని పోలీసులు తెలిపారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement