Friday, April 26, 2024

హైదరాబాద్‌లో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం

డా.బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లో అంబేద్కర్ విగ్రహానికి మంత్రి కేటీఆర్ నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. హైదరాబాద్ నగరంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహాన్ని భారీ ఎత్తున ప్రతిష్ఠిస్తామని ప్రకటించారు. అందరికీ సమాన హక్కులు ఉండాలన్న అంబేద్కర్ ఆశయాలు ఎంతో గొప్పవని, ఆయన ఆశయాలను నెరవేర్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.

కాగా ఈరోజు మహబూబ్‌నగర్ జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటించనున్నారు. జడ్జర్లలో మినీ ట్యాంక్ బండ్, కావేరమ్మ పేటలో నిర్మించిన డబుల్ బెడ్ రూంల ఇళ్లను ఆయన పరిశీలించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement