Friday, December 6, 2024

మంత్రి గంగుల జ‌న్మ‌దిన వేడుక‌లు.. 55 కిలోల కేక్ కటింగ్

శిశు సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ 55వ జన్మదినం సందర్బంగా క‌రీంగ‌న‌ర్ లోని తెలంగాణ చౌక్ లో 55 కిలోల కేకు కట్ చేసి జన్మదిన వేడుకలు జరిపారు. బీఆర్ఎస్ పార్టీ నగర అధ్యక్షుడు చల్ల హరి శంకర్ ఏర్పాటు చేసిన కేక్ నగర మేయర్ యాదగిరి సునీల్ రావు కట్ చేసి స్వీట్ పంపిణీ చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో కార్పొరేటర్లు, బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

మేయర్ క్యాంప్ కార్యాలయంలో ..
మంత్రి గంగుల కమలాకర్ పుట్టినరోజు సందర్భంగా మేయర్ క్యాంప్ కార్యాలయంలో నగర మేయర్ యాదగిరి సునీల్ రావు కేక్ కట్ చేసి స్వీట్ పంపిణీ చేశారు. కార్య‌క్ర‌మంలో కార్పొరేటర్లు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement