Monday, April 29, 2024

లోకేష్ పాదయాత్రలో హైడ్రామా.. ఓవైపు నిరసన.. మరో వైపు సంఘీభావం

కర్నూలు : లోకేష్ పాదయాత్రలో హై డ్రామా చోటుచేసుకుంది. కర్నూలు హైకోర్టు బెంచ్ వద్దు.. హైకోర్టు ముద్దు అంటూ కొంతమంది న్యాయవాదులు లోకేష్ పాదయాత్రను అడ్డుకునే ప్రయత్నం చేశారు. స్థానిక ఎస్వి కాంప్లెక్స్ వద్ద వారిని పోలీసులు అడ్డుకోగా నిరసన చేపట్టారు. ఇదే సమయంలో మరి కొంతమంది న్యాయవాదులు కోర్టు ఎదుట లోకేష్ పాదయాత్రకు సంఘీభావం చెబుతూ హైకోర్టు బెంచ్ ప్రకటించినందుకు ఆయనను కలిసి కృతజ్ఞతలు చెప్పడం విశేషం. టిడిపి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిన లోకేష్ కి న్యాయవాదులు ధన్యవాదాలు తెలిపారు. కర్నూలుకు కేటాయించిన జ్యూడిషియల్ అకాడమీని జగన్ తరలించారు. హై కోర్టు ఏర్పాటు చేస్తామని నాలుగేళ్లుగా మోసం చేశారు. అమరావతిలోనే హైకోర్టు ఉంటుందని సుప్రీం కోర్టులో వైసిపి ప్రభుత్వం తెలిపింది. విశాఖలో హైకోర్టు అని మంత్రి బుగ్గన చెప్పారు. జగన్ మాయ మాటలువిని మోసపోయామని న్యాయవాదులు ఆవేదన వ్యక్తం చేయగా, లోకేష్ మాట్లాడుతూ.. జగన్ లా మాట మార్చి, మడమ తిప్పే బ్యాచ్ మాది కాదు. బెంచ్ ఖచ్చితంగా ఏర్పాటు చేసి తీరుతామని హామీ ఇచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement