Thursday, April 25, 2024

ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు జీతాల కష్టాలు.. ఢిల్లీలో మకాం వేసిన మంత్రి..?

నెల ప్రారంభమై ఇప్పటికే మూడు రోజులైనా ఏపీలో ఇంకా ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు జీతాలు అందలేదు. ప్ర‌తి నెలా ఇదే తంతు నెలకొంటోంది. అయితే ఈసారి జీతాల‌కు డ‌బ్బులు అడ్జెస్ట్ చేసేందుకు ఆర్థిక మంత్రి బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్ రెడ్డి తీవ్రంగా శ్ర‌మిస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఆయ‌న కేంద్ర మంత్రుల‌ను క‌లుస్తూ రుణం పొందేలా అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ఆర్‌బీఐ ద‌గ్గ‌ర ప్ర‌భుత్వం త‌న‌కున్న మార్గాల‌ను అన్నింటిని ఇప్ప‌టికే వినియోగించుకుంది. కొత్త‌గా అప్పులు చేసేందుకు కేంద్రం నిరాక‌రించింద‌న్న వార్త‌లొస్తున్నాయి. ప్ర‌తి మంగ‌ళ‌వారం ఆర్బీఐ ప్ర‌భుత్వ బాండ్ల వేలం వేస్తుంది. అలా రూ.2వేల కోట్లు వ‌చ్చే అవ‌కాశం ఉంటుంది. కానీ ప్ర‌తి నెల ఏపీ స‌ర్కార్ ఈ ఆప్ష‌న్ వాడుకుంటుండ‌టంతో ఈ నెల ఆ అవ‌కాశం కూడా ద‌క్కేలా లేద‌ని తెలుస్తోంది.

ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు అందించడానికి ఆర్థిక మంత్రి బుగ్గన ఎలాగైనా అప్పు పుట్టేలా అన్ని దారులు వెతుకుతున్న‌ట్లు తెలుస్తోంది. నెలాఖ‌రు వ‌చ్చిందంటే అప్పు కోసం ఆర్థిక మంత్రి బుగ్గ‌న ఢిల్లీ వ‌స్తార‌న్న ప్ర‌చారం ఉంది. కానీ ఈసారి ఆ అప్పు కూడా పుట్టేలా లేక‌పోవ‌టం… బ‌య‌టి నుండి అప్పులు వ‌చ్చేలా లేక‌పోవ‌టంతో జ‌గ‌న్ స‌ర్కార్ ఏం చేస్తుంద‌న్న ఆందోళ‌న ఉద్యోగుల్లో నెల‌కొంది.

ఇది కూడా చదవండి: ఈనెలలోనే 1,328 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

Advertisement

తాజా వార్తలు

Advertisement